రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. షాకింగ్ గా లవర్ యూటర్న్
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ విషయంలో ప్రస్తుతం టాలీవుడ్ లో కొంచెం పెద్ద రచ్చే నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా కెరీర్ లో అసలే సరైన సినిమాలు లేవు. ఉన్న ఆఫర్స్ లో ఏదో చేసుకుంటూ వస్తున్నా రాజ్ తరుణ్ ఇప్పుడు ఒక్క సినిమా అయితే చేతిలో పెట్టుకున్నాడు. మరి ఆ సినిమానే 'తిరగబడరా సామి' కాగా ఈ చిత్రం ఈ ఆగస్ట్ లో రిలీజ్ కి ఖరారు చేశారు.
అయితే ఈ సినిమా పనులు జరుగుతున్నా సమయంలోనే తనని దారుణంగా రాజ్ తరుణ్ నమ్మించి మోసం చేసాడు అంటూ తన లవర్ లావణ్య తెరపైకి వచ్చింది. తనని రాజ్ తరుణ్ వాడుకున్నాడు అంటూ ఇప్పుడు తనని కాదని మరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని తెరపైకి వచ్చింది. ఇలా ఈమె ఎంట్రీతో తన సినిమా కంటే రాజ్ తరుణ్ ఇప్పుడు ఫేమస్ అయ్యాడు.

కాగా ఇప్పుడు చేసిన తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా తోనే రాజ్ తరుణ్ ఇప్పుడు లవ్ లో ఉన్నాడని నా లవర్ ని నాకు ఇచ్చేయ్ అంటూ లావణ్య అలాగే మాల్వి మల్హోత్రాల కాల్ రికార్డింగ్స్ కూడా బయటకి వచ్చాయి. దీనితో ఎవరి వెర్షన్ లు వాళ్ళకి ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతా తిరిగి రాజ్ తరుణ్ పీకల మీదకి వచ్చేలా ఉందని చెప్పాలి.
ఇన్ని రోజులు రాజ్ తరుణ్ పై ఎలాంటి కక్ష లేదని పరిస్థితి చేదాటడంతోనే అతనిపై కేసు వేశానని ఇప్పుడు వచ్చినా రాజ్ తరుణ్ తోనే తాను కలిసి ఉంటానని నాకు ఇంకెవరు వద్దని చెప్పిన లావణ్య ఇపుడు అతడికి శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చింది. ఇదొక్కటే కాకుండా ఎఫ్ ఐ ఆర్ లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాల పేర్లతో పాటుగా మాల్వి మల్హోత్రా తమ్ముడు పేరును కూడా యాడ్ చేసి మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.

ఇక ఇదే అనుకుంటే ఇంకా అసలు మేటర్ ఉంది. ఇన్ని రోజులు మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ లు ప్రేమలో ఉన్నారు అనుకుంటే ఇప్పుడు ఈమె రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో నేను సింగిల్ నాకు ఎలాంటి లవ్ లేదు నేను ఒక్క సినిమాని మాత్రమే ప్రేమిస్తున్నాను అంటూ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. నాకు ఈ సినిమా తోనే రాజ్ తరుణ్ పరిచయం తప్ప అతడి పర్శనల్ విషయాలు ఏవి నాకు తెలిదు అని లావణ్య కోసం కూడా రాజ్ తరుణ్ నాకెప్పుడూ చెప్పలేదని చెప్పిందట.
అయినా తాను ఎప్పుడూ ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కుంటాను అనుకోలేదు అని ఇప్పుడు నా దృష్టి అంతా నా కెరీర్ మీదే ఉందని తెలిపింది. దీనితో ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో ఇద్దరూ రివర్స్ అయ్యారని చెప్పాలి. మరి ఈ ఊహించని ట్విస్ట్ లతో ఈ కేసు ఎక్కడికి వెళుతుందో ఏంటో అనేది మరింత రసవత్తరంగా మారింది.


Click it and Unblock the Notifications











