'టచ్ చేసి చూడు' ట్విట్టర్ రివ్యూ: మాస్ మహారాజా మెప్పించాడా?..
'రాజా ది గ్రేట్'తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజా.. ఈసారి 'టచ్ చేసి చూడు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ మసాలా మూవీ వచ్చి చాలా కాలం అవుతుండటంతో.. ఈ సినిమాతో ఆ లోటు తీర్చాడా?.. 'టచ్ చేసి చూడు' అందరిని 'టచ్' చేసేలా ఉందా?.. సినిమాపై ట్విట్టర్ లో అభిమానులు ఏమంటున్నారో ఒకసారి పరిశీలిద్దాం..
బీ, సీ ఆడియెన్స్‌ను మెప్పించేలా:
'టచ్ చేసి చూడు' ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ ఓకె. మొత్తంగా బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.
సెకండాఫ్ వీక్:
ఛలో, టచ్ చేసి చూడు.. ఈ రెండు సినిమాలకు సెకండాఫ్ చాలా వీక్‌గా ఉంది. ప్రీమియర్ 'షో'లు ముగిశాక బిలో యావరేజ్ టాక్ వినిపిస్తోంది.
కామెడీ రాశిఖన్నా చుట్టే..
టచ్ చేసి చూడులో మూడో పాట మనసా బాగుంది. కామెడీ అంతా రాశి ఖన్నా చుట్టే తిరిగింది. మొత్తంగా సినిమా బాగుంది.
ఎంటర్టైనింగ్.
సినిమా ఎంటర్టైనింగ్‌గా ఉంది. రవితేజ లేకపోతే సినిమా మరోలా ఉండేది.
బాగాలేదు..:
రవితేజ ఫ్లాప్స్ జర్నీ కొనసాగుతోంది. టచ్ చేసి చూడు అట్టర్ ఫ్లాప్. కథ ఏమాత్రం బాగాలేదు.


Click it and Unblock the Notifications











