ట్విట్టర్ రివ్యూ : రజనీ 2.0.. మతి పోగొడుతున్న గ్రాఫిక్స్.. ఇండియన్ సినిమాలోనే బెస్ట్ క్లైమాక్స్!

Recommended Video

Robo 2.O Twitter Review: To Beat the Record of #2.O It Will Take Another 10 Years!!

దిగ్గజ దర్శకుడు శంకర్, ఇండియన్ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజీ కాంబినేషన్ లో 2.0 చిత్రం తెరకెక్కింది. దేశం మొత్తం సినీ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. థియేటర్స్ వద్ద రజనీకాంత్ అభిమానుల కోలాహలం మొదలైంది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 2.0పై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. మొబైల్ ఫోన్ల చుట్టూ అల్లిన కథతో శంకర్ ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ లోవిజువల్స్ గ్రాండ్ గా కనిపించాయి. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. యూఎస్ లో, ఇండియాలోని ప్రధాన నగరాలలో ప్రీమియర్స్ సందడి మొదలైంది. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి స్పందంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం.

ఇండియన్ సినిమాలోనే

2.0 అద్భుతమైన సినిమా. ఇంటర్వెల్ సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. భారత సినిమా చరిత్రలోనే శంకర్ అద్భుతమైన క్లైమాక్స్ తీర్చిదిద్దారు.

ఫస్టాఫ్ చూస్తుంటే

థియేటర్ లో సినిమా చూస్తున్నా. ఫస్టాఫ్ మతిపోగొట్టేలా ఉంది. శంకర్ తిరుగులేని దర్శకుడు.

గర్జిస్తున్న 2.0


ఎక్కడ చూసినా 2.0 గర్జనే వినిపిస్తోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ దశాబ్దంలో అతిపెద్ద విజయంగా నిలుస్తుంది.

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్

శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. ఇండియన్ సినిమాకు సరికొత్త దారిని చూపించే చిత్రం ఇది. విజువల్స్ అబ్బురపరిచే విధంగా ఉన్నాయి.

మరో పదేళ్లు పడుతుంది


2.0 సెట్ చేసే రికార్డులు తిరగరాయాలంటే మరో పదేళ్లు పడుతుంది. ఈ సినిమా మ్యాజిక్ ని అంతా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఇది గొప్ప చిత్రం.

ఫస్టాఫ్ హైలైట్స్


ఫస్టాఫ్ అదిరిపోయింది. అద్భుతమైన టైటిల్ కార్డ్స్ నుంచే ఆడియన్స్ హంగామా మొదలవుతుంది. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం మరో స్థాయిలో ఉంది.

ఇద్దరూ పంచుకున్నారు

2.0 గురించి చెప్పాలంటే.. ఫస్టాఫ్ రజనీకాంత్ అదరగొట్టేశారు. సెకండ్ హాఫ్ అక్షయ్ కుమార్ ఇరగదీసాడు.

హాలీవుడ్ స్థాయిలో

శంకర్ ఇమాజినేషన్ అద్భుతం. మనవాళ్ళు హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయలేరని ఎవరు చెప్పారు. 2.0 చూడండి. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది.

పాజిటివ్ రిపోర్ట్స్

ఫస్ట్ హాఫ్ కు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

ఆ విషయంలో శంకర్ కింగ్

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సందేశాత్మక, కమర్షియల్ అంశాలతో సినిమాలు చేయడంలో శంకర్ కింగ్.

వరల్డ్ క్లాస్


నేను చూసిన ఇంటర్వెల్ సన్నివేశాలలో 2.0 వరల్డ్ క్లాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X