డమ్మీస్టార్ మహేష్.. రీమేక్ స్టార్ విజయ్.. సోషల్ మీడియాలో వార్ టాప్ ట్రెండింగ్
డమ్మీస్టార్ మహేష్.. రీమేక్ స్టార్ విజయ్.. సోషల్ మీడియాలో వార్ టాప్ ట్రెండింగ్
స్టార్ హీరో, సౌతిండియన్ స్టార్, మా హీరో ఫాలోయింగ్ ఎక్కువ, మా హీరో రికార్దులే ఎక్కువ అంటూ ఫ్యాన్స్ చేసే హడావిడి అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు ఈ పైత్యం అంతా.. ఒక భాషలోని హీరోల మధ్య మాత్రమే ఉండేవి. కానీ సోషల్ మీడియా యుగం పెరిగిన తరువాత భాషా హద్దులు చెరిగిపోయాయి. అన్ని భాషల చిత్రాలు, అన్ని వర్గాల ప్రేక్షకులు, అన్ని ప్రాంతాల వారు చూస్తున్నారు. దీంతో ప్రతీ హీరో గురించి అందరికీ తెలుస్తూనే ఉంది.

ఫ్యాన్స్ వార్ మామూలే..
తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప అని వాదులాడుకోవడం సర్వ సాధారణంగా జరిగేదే. ఈ గొడవలన్నీ తెలుగు, తమిళ నాటే ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తమిళంలో రజినీ, అజిత్, విజయ్ వంటి వారి మధ్య ఎక్కువగా ఉంటుంది. ఒకరి ఫ్యాన్స్ మిగతా హీరోల మీద కామెంట్స్ చేస్తుంటారు.

గతంలోనూ ఇదే మాదిరి..
గతంలో నారప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సమయంలోనూ కోలీవుడ్, టాలీవుడ్ వార్ నడిచింది. ధనుష్, వెంకీ మధ్య మొదలైన వార్.. మొత్తం కోలీవుడ్, టాలీవుడ్‌గా చీలి పోయింది. ఇరు భాషల హీరోలను ఏకిపారేశారు. మీ హీరోలు వేస్ట్ అంటే మీ హీరోలు వేస్ట్ అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు.

తాజాగా మరోసారి..
తాజాగా గిల్లీ (ఒక్కడు రీమేక్) చిత్రం టెలివిజన్‌లో ప్రసారమైంది. ఈ మేరకు గిల్లీ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈ విషయమై ఎక్కడో మొదలైన గొడవ.. రీమేక్ స్టార్ విజయ్, డమ్మీ స్టార్ మహేష్ బాబు అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తూ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యేట్టు ట్వీట్స్ చేస్తున్నారు.

టాప్‌లో ట్రెండింగ్..
రీమేక్ స్టార్ అంటూ విజయ్‌ను మహేష్ బాబు ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఫేక్ కలెక్షన్స్, నో ఎమోషన్స్ అంటూ మహేష్ బాబును విజయ్ ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్ ఎంత వరకు కొనసాగుతుందనేదీ, ఈ గొడవను ఎవరు ఎందుకు ఎలా మొదలు పెట్టారో కూడా చెప్పలేం.


Click it and Unblock the Notifications











