»   » పవన్ ఫ్యాన్స్‌ను తప్పుదారి పట్టిస్తున్నావ్, బండ్ల గణేష్ మీద ఫైర్

పవన్ ఫ్యాన్స్‌ను తప్పుదారి పట్టిస్తున్నావ్, బండ్ల గణేష్ మీద ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వరల్డ్ పవనిజం డే' సందర్భంగా చేసిన ట్వీట్.... నిర్మాత బండ్ల గణేష్, వర్మకు మధ్య ఆసక్తికర చర్చకు దారి తీసింది. వరల్డ్ పవనిజం డే సందర్భంగా నేను ఓ విషయం బలంగా నమ్ముతున్నాను. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం బాహుబలి కంటే పెద్ద హిట్టవుతుందంటూ వర్మ ట్వీట్ చేసారు. ఈ ట్వీటుకు నిర్మాత బండ్ల గణేష్ కామెంట్ చేయడం, వర్మ కూడా మళ్లీ రిప్లై ఇవ్వడం ఇలా పెద్ద చర్చకే దారి తీసింది.

ఈ క్రమంలో నిరక్షరాస్యులైన పవన్ కళ్యాణ్ అభిమానులను తప్పుదారి పట్టిస్తున్నావంటూ నిర్మాత బండ్ల గనేష్ మీద రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. వర్మ కామెంట్లకు బండ్ల గనేష్ కూడా తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. మరి వారి మధ్య జరిగిన ట్విట్టర్ చాట్ వివరాలు ఇలా ఉన్నాయి.

బండ్ల గణేష్: మాకు తెలిసిందే మాకు ప్రపంచం. మా ప్రపంచం లోకి పవర్ స్టార్ వచ్చిన రోజే మాకు వరల్డ్ పవనిజం డే

రామ్ గోపాల్ వర్మ: కాంట్ డౌన్ మై లిటరసీ ఫర్ ఇల్లిటరేట్స్... పవనిజం‌ బుక్ లో కూడా ఇదే చెప్పారు.

బండ్ల గణేష్: మీరు ఎడ్యుకేటెడ్ అవ్వొచ్చు. తక్కువ చదువు ఉన్న మాకు సంస్కార వంతమైన జీవితం ఇచ్చిన పవన్ కళ్యాణ్ వివేకానందుడు. మాకు పవన్ కళ్యాణ్ దేవుడు అంతే. పోయెట్రీతో మాకు సంబంధం లేదు.

రామ్ గోపాల్ వర్మ: పవన్ కళ్యాణ్ ‘పవనిజం' బుక్ ఎవరైనా చదవితే నేను చెబుతున్న విషయాలను, నా ఆలోచనలను అర్థం చేసుకుంటారు. నువ్వు పవన్ అభిమానులను తప్పుదారి పట్టిస్తూ చెడగొడుతున్నావ్.

బండ్ల గణేష్: మాకు బుక్ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ లుక్ మాపై పడితే చాలు.

రామ్ గోపాల్ వర్మ: బుక్ చదవటం అవసరం లేదని భోదించి వాళ్లలోని నిరక్షరాస్యతని ప్రోద్భలించి తప్పు దారి పట్టిస్తున్నారు.

బండ్ల గణేష్: బుక్ మీ లాంటి వాళ్లు చదివి మా లాంటి వాళ్లని ఎడ్యుకేట్ చేయండి. వెక్కిరించకండి.

రామ్ గోపాల్ వర్మ: ఓ బుక్ చదవాల్సిన అవసరం లేదని నీలాంటి వారు చెబుతుంటే...చదివిన వారు ఎవరైనా ఆ బుక్ లోని విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తే ఎవరు నేర్చుకుంటారు.

బండ్ల గణేష్: చదువు వేరు... నేర్చు కోవడం వేరు. మీకు చెప్పాలా సార్ మేము.

స్లైడ్ షోలో ట్వీట్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్...

రామ్ గోపాల్ వర్మ ట్వీట్

రామ్ గోపాల్ వర్మ ట్వీట్


పవనిజం డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్

కామెంట్స్..

కామెంట్స్..


రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ తో వర్మ, బండ్ల గణేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

తారాస్థాయికి

తారాస్థాయికి


వర్మ, బండ్ల గణేష్ మధ్య కామెంట్స్ వార్ తారా స్థాయికి చేరింది.

తప్పుదారి పట్టిస్తున్నావ్

తప్పుదారి పట్టిస్తున్నావ్


ఓ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులను నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావంటూ వర్మ ఫైర్ అయ్యారు.

అభిమానులు కూడా...

అభిమానులు కూడా...


పలువు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ కామెంట్స్ యుద్ధంలో బండ్ల గణేష్ కు మద్దతుగా నిలిచారు.

వాడి వేడిగా..

వాడి వేడిగా..


ట్విట్టర్లో వర్మ, బండ్ల గణేష్ మధ్య వాడి వేడిగా జరిగిన చర్చ హాట్ టాపిక్ అయింది.

English summary
Twitter war between RGV & Bandla Ganesh about Pawan Kalyan.
Please Wait while comments are loading...