twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్షమాపణ చెప్పారు : దాడి ఘటనపై రామ్ చరణ్ స్పందన

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సినీ నటుడు రామ్ చరణ్ ఇటీవల బంజారా హిల్స్ నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులను తన బాడీగార్డులతో కొట్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై రామ్ చరణ్ స్పందించారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ...'దాడికి గురైన ఇద్దరు వ్యక్తులు తమదే తప్పు అని ఒప్పుకున్నారని, తనకు క్షమాపణలు చెప్పారని' వెల్లడించారు.

    ఆ ఇద్దరు వ్యక్తులు రాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు, బ్యాడ్‌గా బిహేవ్ చేసినట్లు రామ్ చరణ్ పేర్కొన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా కేసు నమోదు కాలేదు. ఈ విషయంలో పోలీసులు తీరును రామ్ చరణ్ ప్రశంసించారు. పోలీసులు పూర్తి విచారణ జరిపి నిజా నిజాలు తెలుసుకున్నారని, తమ తప్పు ఉన్నందు వల్లనే ఆ ఇద్దరు వ్యక్తులు కంప్లైంట్ చేయలేదని రామ్ చరణ్ తెలిపారు. ఈ సంఘటన విషయంలో నిజాయితీగా వ్యవహరించిన పోలీసులకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

    కాగా.....దాడి జరిగి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా పోలీసులు కేసు నమోదు చేయక పోగా, దానికి బాధితులు ఫిర్యాదు చేయలేదనే సాకు చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బున్నోళ్ల కండకావరానికి ఇది నిదర్శనమనే వాదనా వినిపిస్తోంది. సలీం అనే న్యాయవాది ఈ ఘటనపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసారు.

    దాడి సంఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేయాలని, బాధితులు ఫిర్యాదు చేయలేదనే కారణంగా కేసు పెట్టక పోవడం వెనక కేంద్ర మంత్రి చిరంజీవి ఒత్తిడి ఉందని ఆయన పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా దాడి కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. న్యాయవాది పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హెచ్ఆర్‌సి ఈ వ్యవహారంపై జూన్ 18లోగా వివరణ ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్‌ను ఆదేశించింది.

    English summary
    The two boys came and apologised for their rash driving and for their bad behaviour," said Ram Charan, who will make his Bollywood debut with ‘Zanjeer’ remake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X