Don't Miss!
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
యూఎస్ సెక్స్ రాకెట్‌లో ఇద్దరు హీరోయిన్ల పేర్లు.. తీగ లాగితే డొంక.. దక్షిణాదికి బిగుస్తున్న ఉచ్చు..
యూఎస్‌లో టాలీవుడ్ సెక్స్ రాకెట్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నది. ఫెడరల్ అధికారులు జరుపుతున్న దర్యాప్తులు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ సెక్స్ కుంభకోణంలో మొదుగుముడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, అతని భార్య చంద్రకళ అరెస్ట్‌తో ఈ కేసు డొంక కదులుతున్నది. ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను అమెరికాకు రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్న కేసులో తీవ్రమైన అభియోగాలతో కిషన్, చంద్రకళపై చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Recommended Video


కన్నడ, తమిళ హీరోయిన్లు
హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్‌లో కన్నడ, తమిళ రంగాలకు చెందిన ఇద్దరు అగ్ర హీరోయిన్ల పేరు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఆ ఇద్దరు ఎవరు అనే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచినట్టు తెలిసింది. పలువురు హీరోయిన్ల పేరు మీడియాలో నానుతున్నప్పటికీ అధికారికంగా వారి పేర్లను ధృవీకరించకపోవడంతో ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.

తప్పుడు పత్రాల సృష్టి
యూఎస్ సెక్స్ కుంభకోణంలో తప్పుడు పత్రాలతో సినీ తారలను రప్పించారనే విషయం మరింత వివాదాన్ని రాజేస్తున్నది. అమెరికాలోని తెలుగు సంఘాల పేరుతో నకిలీ లెటర్ ప్యాడ్లను సృష్టించి సినీ తారలను రప్పించారు అనే విషయం ఎన్నారై సంఘాల నిర్వాహకులు కంగుతింటున్నారు.

వీసాల కోసం అనేక అక్రమాలు
శ్రీరాజ్ అలియాస్ కిషన్, చంద్రకళ పర్మిణ అలియాస్ వేభ జయం అనేక తప్పుడు చర్యలకు పాల్పడినట్టు అమెరికా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వీసాల కోసం పలు సంఘాల లెటర్ హెడ్స్‌ను ఫోర్జరీకి పాల్పడినట్టు సమాచారం.

హీరోయిన్‌కు సన్మానంపై
ఓ హీరోయిన్‌ను సన్మానించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టీఏఎస్‌సీ) ఆహ్వానం పంపినట్టు విచారణలో వెలుగు చూసింది. అయితే దానితో తమకు సంబంధం లేదని, మేము ఏ హీరోయిన్‌కు తమ లెటర్ ప్యాడ్‌పై ఆహ్మానం పంపలేదని టీఏఎస్‌సీ స్పష్టం చేసింది.

తమిళ హీరోయిన్ పిలువలేదు
అమెరికాలో సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇటీవల నార్త్ అమెరికా తెలుగు సొసైటి (నాట్స్)ను ఫెడరల్ అధికారులు విచారించారు. అయితే తాము ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. గత నవంబర్‌లో ఇల్లినాయిస్, స్కాంబర్గ్‌లోని రెన్సాసెన్స్ సెంటర్‌లో ఎలాంటి సదస్సును నిర్వహించలేదని, ఆ కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లను పిలిపించలేదు అని నాట్స్ నిర్వాహకులు వెల్లడించారు.

42 మంది కోసం రిజర్వేషన్లు
యూఎస్ సెక్స్ రాకెట్ వ్యవహారంపై అమెరికా తెలుగు అసోసియేషన్ (ఏటీఏ) స్పందించింది. తాము ఎలాంటి ఈవెంట్లను నిర్వహించలేదని స్పష్టం చేసింది. కన్నడ, తెలుగు సినీ తారలను తమ సంఘం తరఫున ఆహ్వానించలేదని చెప్పారు. దర్యాప్తులో భాగంగా శ్రీరాజు చెన్నుపాటి ఈమెయిల్స్‌ను పరిశీలించారు. ఈ విచారణలో 42 మంది కోసం రిజర్వేషన్లు చేయించినట్టు బయటపడింది.