కళ్యాణ్ రామ్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్. దర్శకుడు అతడే!
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఎంఎల్ఎ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో త్వరలో నా నువ్వు సినిమాను విడుదల చెయ్యబోతున్నాడు. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గ నటిస్తోంది. తాజాగా కళ్యాణ్ రామ్ ఆర్య, అతడు, జల్సా, దూకుడు వంటి హిట్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయనున్నాడు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్టులో శాలిని పండే, నివేద థామస్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఈ సినిమా తరువాత పవన్ సాదినేని దర్శకత్వంలో కూడా కళ్యాణ్ రామ్ ఓ సినిమాను చేయనున్నాడు. ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక గుహన్ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ మూవీతో పాటు మజ్ను సినిమా దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాఫ్ లో తెరకేక్కబోతున్న ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











