రెండు కొత్త లుక్స్‌లో వరుణ్.. స్పేస్ మూవీ తరువాత అదే దారిలో!

Recommended Video

Varun Tej Went To Space వరుణ్ కి బంపర్ ఆఫర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు వరుస విజయాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు. దర్శక నిర్మాతలు వరుణ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతుండడం విశేషం. ఫిదా, తొలిప్రేమ రెండు చిత్రాలు వరుణ్ కు లవర్ బాయ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రంగా స్పేస్ మూవీని ఎంచుకుని కొత్త బాటపట్టాడు. దీనితో వరుణ్ వైవిధ్యమైన చిత్రాలు తాను రెడీ అనే సంకేతాలు పంపాడు. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినా ఇప్పుడు కుదురుకున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించే స్పేస్ మూవీ తెరక్కుతుంది. ఈ చిత్రం తరువాత వరుణ్ చేయబోయే సినిమా గురించి ఆసక్తికరమైన కథనాలు వస్తున్నాయి.

పెరుగుతున్న క్రేజ్

పెరుగుతున్న క్రేజ్

ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. వరుణ్ తేజ్ కు క్రేజ్ పెరుగుతుండడంతో దర్శక నిర్మాతలు అతడితో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.

తొలిప్రేమలో నటన అదుర్స్

తొలిప్రేమలో నటన అదుర్స్

వరుణ్ నటించిన చివరి చిత్రం తొలిప్రేమ. ఈ చిత్రంలో వరుణ్ అద్భుతమైన నటన కనబరిచాడు. మూడు షేడ్స్ లో నటించి మెప్పించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద తొలిప్రేమ చిత్రం ఘనవిజయం సాధించింది.

ప్రయోగాత్మక చిత్రం

ప్రయోగాత్మక చిత్రం

ఫిదా, తొలిప్రేమ తరువాత చిత్ర వర్గాల చూపు వరుణ్ పై పడింది. వరుణ్ నటించబోయే చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నతరుణంలో ప్రయోగాత్మక చిత్రాన్ని ఎంచుకుని ఆశ్చర్యపరిచాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ మూవీలో నటించడానికి వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు.

అంతరిక్షంలో ఉన్నట్లుగా నటించడం కోసం

అంతరిక్షంలో ఉన్నట్లుగా నటించడం కోసం

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ అంతరిక్షంలో ఉన్నట్లుగా నటించడం కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్పేస్ లో ఉండే ప్రత్యేక పరిస్థితుల్లో, ఎలా నటించాలి, ఈతరహా హావభావాలు వ్యక్త పరచాలి వంటి విషయాల్లో వరుణ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరో రొమాంటిక్ మూవీ

మరో రొమాంటిక్ మూవీ

సాగర్ చంద్ర దర్శత్వంలో వరుణ్ తేజ్ నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందబోతోందట. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ రెండు కొత్త మెకోవర్స్ ని ట్రై చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X