twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్కరకొక్కరుగా బయటకొస్తున్న కరాటే కళ్యాణి బాధితులు.. రేప్ కేసంటూ ఒకరు, బ్లాక్ మెయిల్ అంటూ మరొకరు!

    |

    సినీనటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన వ్యవహారం ఇప్పటికీ రచ్చ లేపుతూనే ఉంది. ఈ వివాదం ముగిసింది అనుకుంటూ ఉన్న సమయంలో ఆ ఇద్దరూ మీడియాకు ఎక్కి ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేశారు. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణికి మరిన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయి ఆమె మీద ఈ కేసుకు సంబంధం లేకుండా మరో రెండు కేసులు నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే...

    Recommended Video

    Karate Kalyani Vs Sreekanth Reddy Controversy పూర్తి వివరాలు | Telugu Filmibeat
     వీడియో చేస్తాను అనడంతో

    వీడియో చేస్తాను అనడంతో


    సినీనటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన గొడవ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఇందులో ఎవరి వర్షన్స్ వారు వినిపించారు కూడా. తనను కరాటే కళ్యాణి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది అని శ్రీకాంత్ రెడ్డి ఆరోపిస్తే, తనకు తెలిసిన అమ్మాయి వీడియో తీయించండి అని అడిగితె శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లాను అక్కడ దురుసుగా ప్రవర్తించి నీకు డబ్బులు ఇస్తాను నీతో వీడియో చేస్తాను అనడంతో తట్టుకోలేక దాడి చేశానని కరాటే కల్యాణి చెప్పుకొస్తున్నారు.

    కేసు నమోదు

    కేసు నమోదు


    ఆ వ్యవహారం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సినీనటి కరాటే కళ్యాణి మీద మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. సోషల్ మీడియా వేదికగా ఒక బాధితుడు కరాటే కళ్యాణి మీద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాలతో ఎస్ ఆర్ నగర్ పోలీసులు గోపి కృష్ణ అనే బాధితుడి పేరు మీద కేసు నమోదు చేశారు. సదరు గోపికృష్ణ వాదన ప్రకారం కరాటే కళ్యాణి బాధితుల్లో ఆయన కూడా ఒకరట.

    భయబ్రాంతులకు గురి చేసిందని

    భయబ్రాంతులకు గురి చేసిందని


    ఒక ఇంటి కొనుగోలు విషయంలో తమ నుంచి మూడున్నర లక్షల రూపాయలు వసూలు చేసి మాతో ఒప్పందం చేసుకుందని ఆయన ఆరోపించారు. బ్యాంకుకు కట్టవలసిన డబ్బులు మేమే కట్టాలని బెదిరించారని, బెదిరింపులకు లొంగకపోవడంతో పురుగుల మందు తాగుతూ వీడియోలు పంపి భయబ్రాంతులకు గురి చేసిందని గోపికృష్ణ ఆరోపించారు. కమిషనర్ నుంచి ఆదేశాలు అందడంతో ఈ వ్యవహారం మీద కేసు నమోదు అయింది.

    సోషల్ మీడియా వేదికగా

    సోషల్ మీడియా వేదికగా


    ఇక ఇప్పుడు ఈ వ్యవహారంతో సంబంధం లేని మరో బాధితుడు తెరమీదకు వచ్చాడు. ఆయన కూడా ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు చేశాడు. ఆమె నుంచి తనకు ప్రాణభయం ఉందని అతను ఆరోపిస్తున్నాడు. అతను చెబుతున్న దాని ప్రకారం గత ఏడాది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువతి మీద అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా కళ్యాణి ప్రచురించారు.

     అలా ఎందుకు చేశారు

    అలా ఎందుకు చేశారు


    అయితే సుప్రీం ఆదేశాల ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలి ఐడెంటిటీ బయట పెట్టకూడదు అంటూ ఆ సమయంలో వెంగళరావు నగర్ లో నివాసం ఉంటున్న కర్నూలుకు చెందిన నితేష్ అనే వ్యక్తి కళ్యాణిని అలా ఎందుకు చేశారు అని ప్రశ్నించాడు. నన్ను అడిగేంత వాడివా నువ్వు అంటూ కరాటే కళ్యాణి అతని మీదకు దాడి దిగిందట.

    బెదిరింపులకు పాల్పడిందని

    బెదిరింపులకు పాల్పడిందని


    దీంతో అతను అప్పట్లోనే జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలా ఫిర్యాదు చేయడంతో అతని మీద కోపం పెంచుకున్న కళ్యాణి నా మీద కంప్లైంట్ చేస్తావా నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని అతను ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ వ్యవహారం మీద కరాటే కళ్యాణి ఎస్.ఆర్.నగర్ పోలీసుల మీద ఫైర్ అయ్యారు.

    English summary
    two more case filed on karate kalyani in sr nagar police station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X