గూఢచారి సంచలన విజయంతో మరో రెండు!
స్పై థ్రిల్లర్ గా వచ్చిన గూఢచారి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అడవిశేష్, శోభిత దూళిపాళ, సుప్రియ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అద్భుతమైన టెక్నికల్ వర్క్, ఊహించని ట్విస్ట్ లతో గూఢచారి చిత్రం ఆడియన్స్ ని అలరిస్తోంది. బాండ్ చిత్రాల తరహాలో సాగె ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.
చిత్ర యూనిట్ అడవి శేష్ అండ్ టీం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఒక సీక్వెల్ కాదు రెండు సీక్వెల్స్ కి సంబందించిన చర్చలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

గూఢచారి చిత్ర సిరీస్ కొనసాగించే ఆలోచనలో ఉన్నారు. సీక్వెల్స్ కి సంబందించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం అడవి శేష్ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 2 స్టేట్స్ రీమేక్ లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











