ప్రభాస్ కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. ఒక బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది మొత్తం మూడు పాన్ ఇండియా సినిమాలను ఎనౌన్స్ చేసి అభిమానులకు మంచి కిక్కు ఇచ్చాడు. ఆ సినిమాలు థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తాయో గాని అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఇటీవల సలార్ సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాను దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సలార్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. మొదట మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ ఎవరనే విషయంలో క్లారిటీ రాలేదు. కానీ వీలైనంత త్వరగా సినిమాకు సంబంధించిన నటీనటులను ఫిక్స్ చేయాలని దర్శకుడు డిసైడ్ అయ్యాడు.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం KGF 2ను రిలీజ్ కు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. షూటింగ్ ముగియడంతో ప్రీ ప్రొడక్షన్ పనులను చాలా సీరియస్ గా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో ఎడిటింగ్ వర్క్ చాలా కీలకమైందట. ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుందని దర్శకుడు KGF 2 పని అయిపోయే వరకు ప్రభాస్ సినిమాను టచ్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











