హిట్టు మాహాత్యం.. సాయి ధరమ్ తేజ్ కోసం ఇద్దరు బడా నిర్మాతలు

సినిమా ఇండస్ట్రీలో హిట్టు పడితే చాలు హీరోల వద్దకు గ్యాప్ లేకుండా నిర్మాతల నుంచి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఇక సాయి ధరమ్ తేజ్ కి కూడా ప్రస్తుతం ఆఫర్స్ అలానే వస్తున్నాయి. ఎందుకంటే చివరగా ఈ హీరో నుంచి వచ్చిన ప్రతి రోజు పండగే సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మెగా హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకుంది.

అంతకుముందు వచ్చిన చిత్రలహరి సినిమా కూడా ఈ హీరో కెరీర్ కి మంచి క్రేజ్ అందించింది. సాధారణంగా సాయి అపజయాల్లో ఉన్నప్పుడే ఆఫర్స్ గట్టిగానే వచ్చాయి. ఇక హిట్స్ వచ్చాక మెగా హీరో ఎంత బిజీగా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నెక్స్ట్ వరుసగా నాలుగు కథలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

Two top tollywood producers for sai dharam tej devakatta film

ఇప్పటికే సోలో బ్రతుకే సో బేటర్ అనే సినిమాను పూర్తి చేసిన సాయి కరోనా వైరస్ తగ్గిన తరువాత ఆ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఆ తరువాత ప్రస్థానం దర్శకుడు దేవకట్టా డైరెక్షన్ లో ఒక సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాను ఇద్దరు సీనియర్ నిర్మాతలు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

వారు మరెవరో కాదు. BVSN ప్రసాద్ - దిల్ రాజు. ఈ ఇద్దరు బడా నిర్మాతలు కూడా సాయి ధరమ్ తేజ్ - దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని సంయుక్తంగా నోర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ నిర్మాతలతో ఒకసారి పని చేసిన సాయి ఇప్పుడు కొంచెం కొత్తగా ఇద్దరితో కలిసి పనిచేస్తుండడం విశేషం. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X