Salman Khan సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం.. ఇంటి వద్ద అగంతకుల కాల్పులు

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం జరిగింది. ముంబైలోని అత్యంత సెక్యూరిటీ కలిగి ఉన్న ప్రాంతంగా పేరున్న బాంద్రాలోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరపడం సంచలనం రేపింది. గత కొద్దికాలంగా సల్మాన్ ఖాన్‌కు ప్రాణ హాని తలపెడుతామని అగంతకులు వార్నింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఆయనకు భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ నివాసంపై జరిగిన కాల్పుల వివరాల్లోకి వెళితే..

ముంబై పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పలు జరిపారు. మోటార్ సైకిల్స్‌పై వచ్చిన అగంతకులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాం అని పోలీస్ ఉన్నతాథికారులు తెలిపారు.

Two Unidentified persons open fires at Salman Khan Residence at Bandra Of Mumbai

ఇదిలా ఉండగా, బాంద్రాలోని సల్మాన్ ఖాన్ అధికార నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన కాల్పుల కలకలం సమాచారం అందుకొన్న వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. ఆ ప్రాంతంలో గోడలపై ఉన్న బుల్లెట్ ఆనవాళ్లను, బుల్లెట్స్‌ను ఫోరెన్సిక్ విభాగానికి పంపినట్టు తెలిపారు.

గత కొద్దికాలంగా సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరు అగంతకులు డెత్ వార్నింగ్ ఇవ్వడంతో ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నందున Y+ క్యాటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అగంతకులను పట్టుకొనేందుకు వేట ప్రారంభించారు.

ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ముప్పు ఉంది. దేశంలోనే ముప్పు ఉన్న టాప్ 10 సెలబ్రిటీలలో సల్మాన్ ఖాన్ ఒకరు అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ముద్దాయిగా ఉన్న సల్మాన్.. తమ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బ తీశారనే నెపంతో డెత్ వార్నింగ్ ఇచ్చినట్టు ఓ కథనం ఉంది.

Two Unidentified persons open fires at Salman Khan Residence at Bandra Of Mumbai

ఇటీవల సంపత్ నెహ్రా అనే గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విచారించగా సల్మాన్ ఖాన్‌ను చంపడానికి సుపారీ ఇచ్చారనే విషయాన్ని ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. అప్పటి నుంచి ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X