‘వకీల్ సాబ్’కు బిగ్ షాక్: థియేటర్ యజమానుల సంచలన నిర్ణయం.. చరిత్రలో తొలిసారి పవన్‌కు ఊహించని కష్టం

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. చాలా కాలం నుంచి తన హవాను చూపిస్తోన్న అతడు.. భారీ చిత్రాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మూడేళ్ల విరామం తర్వాత ఇప్పుడు 'వకీల్ సాబ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నోఅంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. కలెక్షన్లనూ భారీగా రాబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ సినిమాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇది ఆడే థియేటర్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Vakeel Saab కి అండగా Mega Family ! | Ram Charan | Pawan Kalyan
రాజకీయాలు టు సినిమాలు.. వకీల్ సాబ్‌గా

రాజకీయాలు టు సినిమాలు.. వకీల్ సాబ్‌గా

రాజకీయాల కోసం గ్యాప్ ఇచ్చి.. దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు.

అదిరిన స్పందన.. వీకెండ్‌లో 60 శాతం పైగా

అదిరిన స్పందన.. వీకెండ్‌లో 60 శాతం పైగా

'వకీల్ సాబ్' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు. టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లనూ సాధించిందీ చిత్రం. వీకెండ్‌లోనే ఏకంగా రూ. 60 కోట్లు వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 60 శాతం రికవరీ చేసినట్లు. అదే సమయంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది.

వకీల్ సాబ్‌కు ఏపీ ప్రభుత్వం నుంచి షాక్‌లు

వకీల్ సాబ్‌కు ఏపీ ప్రభుత్వం నుంచి షాక్‌లు

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కరోనా విజృంభిస్తోన్న వేళ స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు వద్దని చెబుతూ వాటికి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ షోలు పడకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. అదే సమయంలో టికెట్ ధరల విషయంలోనూ ప్రభుత్వం షాకిచ్చింది.

టికెట్ రేట్ల విషయంలో.. హైకోర్టు తీర్పు ఇలా

టికెట్ రేట్ల విషయంలో.. హైకోర్టు తీర్పు ఇలా

'వకీల్ సాబ్' టికెట్ ధరల విషయంలో వివాదం రాజుకుంది. ఈ సినిమాకు వసూలు చేసే చార్జ్‌ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి.. థియేటర్ యజమానులకు నిర్ణీత ధరలతో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వాళ్లు మాత్రం దీన్ని ధిక్కరించారు. దీంతో సర్కారు హైకోర్టును ఆశ్రయింది. అక్కడ టికెట్ రేట్లు నిర్ణీత మొత్తంలోనే వసూలు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది.

మరోసారి కోర్టుకు వెళ్లనున్న యజమానులు

మరోసారి కోర్టుకు వెళ్లనున్న యజమానులు

టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయాలని థియేటర్ యాజమాన్యలు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సోమవారం ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్టు సమాచారం. సర్కార్ కొత్త జీవో వచ్చే వరకు పాత ధరలను అలాగే అమలు చేయాలని పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.

థియేటర్ యజమానుల సంచలన నిర్ణయం

థియేటర్ యజమానుల సంచలన నిర్ణయం

ఏరియాను బట్టి టికెట్ ధరలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పెద్ద పెద్ద పట్టణాలు మినహా మిగిలిన చోట్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో హౌస్ ఫుల్ అయినా రోజు మొత్తంలో లక్ష రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో తాజాగా కొన్ని థియేటర్ల యజమానులు సినిమా ప్రదర్శనను నిలుపదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పవర్ స్టార్ సినిమాకు ఊహించని కష్టాలు

పవర్ స్టార్ సినిమాకు ఊహించని కష్టాలు

ఆంధ్రప్రదేశ్‌లోని మండల స్థాయిలో ఉన్న థియేటర్లలో టికెట్ ధరలు 10, 20, 30 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో గజపతినగరం సహా కొన్ని ఏరియాల్లోని 'వకీల్ సాబ్' థియేటర్లను మూసివేశారు యజమానులు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా జారీ చేశారు. ఫుల్ రన్‌లోనూ సినిమాను కొన్న డబ్బులు తిరిగి వచ్చే పరిస్థితి లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X