రవితేజ ‘నిప్పు’ సెన్సార్ పూర్తి
మాస్ మహారాజా రవితేజ, దీక్షాసేథ్ హీరో హీరోయిన్లుగా బొమ్మరిల్లు వారి పతాకంపై గుణశేఖర్ దర్శకత్వంలో వై.వి.ఎస్ చౌదరి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'నిప్పు' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత వైవిఎస్ మాట్లాడుతూ... మా బేనర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'నిప్పు' సెన్సార్ పూర్తి చేసకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు అందరి ఆదరణ పొందాయి. అలాగే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్‌కి కూడా ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
రవితేజ ఈ సినిమాలో సూర్య పాత్రలో నటిస్తున్నాడని, ఎలాంటి బాధ్యతలు లేని, ఎలాంటి లక్ష్యాలేని జులాయిలా ఉంటాడు. అయితే ఉన్నట్టుండి అతనిపై పెద్ద బాధ్యత వచ్చి పడుతుంది. ఈ క్రమంలో సినిమా ఆసక్తికరంగా సాగుతుందని వైవిఎస్ చెప్పుకొచ్చారు.
రవితేజ, దీక్షా సేథ్, డా. రాజేంద్ర ప్రసాద్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, ముకుల్ దేవ్, బ్రహ్మాజీ, సుప్రీత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఆకుల శివ, శ్రీధర్ సీపన, సంగీతం: థమన్, సినిమాటో గ్రఫీ: సర్వేష్ మురారి, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: గౌతం రాజు, ఫైట్స్: కనల్ కణ్ణన్, డాన్స్: రాజు సుందరం, బృంద, గణేష్ తరుపాయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. ఆర్. కిషోర్, కో ఫ్రొడ్యూసర్: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వైవిఎస్ చౌదరి, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications











