పూల రంగడు సెన్సార్ పూర్తి

By Bojja Kumar

సునీల్, ఇషా చావ్లా జంటగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్ఫణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై వీరభద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి నిర్మిస్తున్న 'పూల రంగడు' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. శివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 18న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ...''మా పూల రంగడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెంట్ పొందింది. ఫిబ్రవరి 18న సినిమాను విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి అందించిన ఆడియో మంచి విజయం సాధించింది. త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న వరల్డ్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అందాల రాముడు, మర్యాద రామన్న చిత్రాలతో హీరోగా ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న సునీల్ 'పూల రంగడు'లో కొత్త యాంగిల్ లో కనిపించ బోతున్నాడు. సునీల్ కెరీర్లోనే అత్యధికంగా 450 థియేటర్లలో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తున్నాం'' అన్నారు.

సునీల్, ఇషా చావ్లా, కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్ గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, వేణు గోపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మేకప్: నాగు, కాస్ట్చూమ్స్: ప్రసాద్, స్టిల్స్: ఎస్. ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీరాములు, కో డైరెక్టర్: గంగాధర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: కొత్త మురళీ కృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: శ్రీధర్ సీపన, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్ ఆర్ మూవీ మేకర్స్, నిర్మాత: అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీరభద్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X