యూ బ్రేక్ మి.... రామ్ చరణ్ భార్య ఉపాసన ట్వీట్ ఎవరిపై?
Recommended Video

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ 'వినయ విధేయ రామా' షూటింగ్ అజర్బైజాన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. చెర్రీ వైఫ్ ఉపాసనకు అజర్బైజాన్ ప్రాంతం, ఇక్కడి వాతావరణం, ఫుడ్ చాలా నచ్చిందట. అపోలో వ్యవహారాలతో బిజీగా ఉండే ఈ బిజినెస్ లేడీ ఏ కాస్త సమయం దొరికినా రామ్ చరణ్ షూటింగ్ స్పాట్లో వాలిపోయేవారు.
తాజాగా ఉపాసన తన ట్విట్టర్ పేజీలో చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశం అయింది. తాను ఫుడ్ లవ్ అనే విషయాన్ని ఈ ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఫుడ్ గురించి ఆమె వర్ణించి తీరు సైతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
యూ మేక్ మి... యూ బ్రేక్ మి
యూ మేక్ మి... యూ బ్రేక్ మి అంటూ.... ఉపాసన తనదైన శైలిలో ఫుడ్ గురించి వర్ణించారు. ఫుడ్ అంటే తనకు ఎంతో గౌరవం అని తెలిపారు.
అజర్బైజాన్ స్థానికులతో..
అజర్బైజాన్‌లో రామ్ చరణ్ షూటింగుతో బిజీగా గడుపుతుంటే ఉపాసన అక్కడి స్థానికులతో కలిసి లోకల్ ఫుడ్‌ను టేస్ట్ చేయడంతో పాటు ఆ వంటకాలను ఎలా చేయాలో నేర్చుకుందట. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఉపాసన తాజాగా షేర్ చేశారు.

రామ్ చరణ్ వచ్చాక ఉపాసన లైఫ్ మారిపోయింది
రామ్ చరణ్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఉపాసన లైఫ్ మారిపోయింది. చెర్రీ ఇన్స్‌స్పిరేషన్‌తో తనకంటూ కొన్ని ఫిట్‌నెస్ గోల్స్ సెట్ చేసుకుని సక్సెస్ అయ్యారు. ఒకప్పటి ఉపాసన లుక్, ఇప్పుడు ఉపాసన లుక్‌లో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే.

వినయ విధేయ రామ
‘వినయ విధేయ రామ' సినిమా విషయానికొస్తే... బోయాపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications