ఇది ఆసక్తిరేపే మలుపు: ‘యూ టర్న్’ ఆది పినిశెట్టి లుక్ రిలీజ్
సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'యూ టర్న్'. కన్నడలో సూపర్ హిట్ అయిన మూవీని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
మూవీలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పాత్ర పోషిస్తున్నారు. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే సమంత పోస్టర్ రిలీజ్ చేయగా... తాజాగా ఆది పినిశెట్టి లుక్ రివీల్ చేస్తూ మరో పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి మర్డర్ మిస్టరీని ఛేదించే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. 'ఈ టర్న్ ఆసక్తి కరంగా ఉంటుంది. పవన్ కుమార్, సమంత, భూమిక, రాహుల్ తదితరులతో కలిసి చేయడం గొప్పగా ఉంది' అని ఆది ట్వీట్ చేశారు.
యూటర్న్ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో రాని ది బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈ మూవీ ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

సాంకేతికవర్గం:
కథ-దర్శకత్వం: పవన్ కుమార్
నిర్మాతలు; శ్రీనివాస చిట్టూరి-రాంబాబు బండారు
నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ & వివై కంబైన్స్
సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి
కళ: ఏ.ఎస్.ప్రకాష్
కూర్పు: సురేష్ అరుముగమ్


Click it and Unblock the Notifications











