ఉదయ్ బాబు రెండవ చిత్రం
శ్రీ మేడారం సమ్మక్క-సారక్క మహాత్యం" చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ఉదయ్ బాబు హీరోగా రెండవ చిత్రం ప్రారంభం కానుంది. ఉదయ్‌బాబు ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ తనయుడన్న విషయం తెలిసిందే. ఎడ్ల జోగిరెడ్డి, వి.సత్యనారాయణగౌడ్ నిర్మాతలుగా మారుతూ అనిల్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి 'గంగ", 'శ్రీమేడారం సమ్మక్క-సారక్క మహాత్యం" చిత్రాల దర్శకుడు వేముగంటి దర్శకత్వం వహించనున్నారు. విజయదశమి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకునే ఈ చిత్రం మాస్ ఎన్టర్ టైన్మెంటుగా ఉంటుందంటున్నారు. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూర్చనున్నారు.
More from Filmibeat
uday babu babu mohan sammakka saarakka edla jogi reddy v satyanarayana gaud anil art శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహత్యం ఉదయ్ బాబు బాబు మోహన్ వేముగంటి అనిల్ ఆర్ట్


Click it and Unblock the Notifications











