ఉదయ్ కిరణ్ అల్లాడించే రోజు ఎప్పుడంటే...
ఉదయ్ కిరణ్, మీరాజాస్మిన్ జంటగా నటించిన చిత్రం 'అల్లాడిస్తా' ఈ నెల 25న సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి రాసిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. బాలి శ్రీరంగం దర్శకుడు. ఈ చిత్రం గురించి నిర్మాత కె.రోహిత్ మాట్లాడుతూ "అడవి నేపథ్యంగా సాగే ప్రేమ కథ ఇది. ఉదయ్ కిరణ్ అటవీశాఖాధికారిగా కనిపిస్తారు. సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే యువతిగా మీరాజాస్మిన్ పాత్ర ఉంటుంది. వీళ్లిద్దరూ ఎలా కలిశారు? వీళ్ల కథ చివరికి ఏం అయింది? అనేది ఆసక్తికరమంటున్నారు. రంభ, రేవతి, రిషి, లారెన్స్, లక్ష్మీరాయ్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ వి.టి.విజయన్, సంగీతం: దేవా, పాటలు: వెన్నెలకంటి, సమర్పణ: కె.సాగర్.ఉదయ్ కిరణ్ చిత్రం చాలా గ్యాప్ తర్వాత రిలీజవటం..ట్రేడ్ లో ఏ మేరకు ఓపినింగ్స్ తెచ్చుకుంటుందని చూడాలి.
ఉదయ్ కిరణ్ మీరా జాస్మిన్ అల్లాడిస్తా కె రోహీత్ కె సాగర్ uday kiran alladista k rohit meera jasmine k sagar


Click it and Unblock the Notifications