చిరు పాటకు ఉదయ్ కిరణ్ స్టెప్స్
చిరంజీవి కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన 'ఇది ఒక నందనవనం...' అనే పాట గుర్తు ఉండని వారుండరు. ఇప్పుడు పాటను రీమిక్స్ చేస్తూ ఉదయ్ కిరణ్ తో నటింపచేస్తున్నారని సమాచారం. గతంలో ఉదయ్ కిరణ్ తో చిరంజీవి కుమార్తెక్ ఎంగేజ్ మెంట్ అయి రద్దవటం, ఆ తర్వాత వారి మధ్య జరిగిన కోల్డ్ వార్ గురించి తెలిసిన వారు ఈ విషయం విని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఉదయ్ మాత్రం దీన్ని లైట్ గా తీసుకుని తన పని తాను చేసుకుపోతున్నాడని తెలుస్తోంది. దర్శకుడు సుభా శెల్వం మొదట ఈ పాట ప్రపోజల్ పెట్టినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనని అయితే పర్శనల్ జీవితానికి వృత్తికి ముడిపెట్టకూడదని ఈ ప్రపోజల్ కి సరే అన్నానని సన్నిహితుల వద్ద ఉదయ్ చెప్పాడని వినపడుతోంది. ఇక ఈ పాటలో ఉదయ్ కిరణ్ తో పాటు శ్వేతాబసు కూడా నర్తించనుంది. శ్వేతా బసు ది ఇది మూడో రిమిక్స్ సాంగ్. మొదట రైడ్లో దంచవే మేనత్త కూతరా, ఆ తర్వాత వజ్రాయుధంలో పాట..ఇప్పుడు ఇది. అలాగే వరస ఫ్లాపులతో వెనకపడ్డ ఉదయ్ కిరణ్ కి ఈ చిత్రమైన కాపాడుతుందమే చూడాలి. ఇంతకీ 'ఇది ఒక నందనవనం..' పాట దొంగ చిత్రం లోది. చక్రవర్తి స్వరపరిచిన ఈ చిత్రంలో రాధ, చిరంజీవి నటించారు. ఎస్పీ బాల సుబ్రమణ్యం ఈ పాటకు ప్రాణం పోసారు. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు.


Click it and Unblock the Notifications











