twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొన్ని శక్తులు ఉదయ్ కిరణ్ జీవితంతో ఆడుకున్నాయి : దాసరి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న యంగ్ యాక్టర్ ఉదయ్ కిరణ్ మృత దేహాన్ని సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్లో ఉంచారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ....'కొన్ని శక్తులు ఉదయ్ కిరణ్ జీవితంతో ఆడుకున్నాయని వ్యాఖ్యానించారు. ఆ కారణంగానే డిప్రెషన్‌లోకి వెళ్లాడు, బహుషా ఈ డిప్రెషన్లోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు, ఇది తీసుకోదగ్గ నిర్ణయం కాదు' అని వ్యాఖ్యానించారు.

    నటుడు చలపలిరావు మాట్లాడుతూ....ఉదయ్ కిరణ్‌ను జై శ్రీరాం సమయంలో చూసాను. ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు మాత్రం కాదు. ఎందుకు ఇలా చేసాడో అర్థం కావడం లేదు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం చాలా బాధా‌కర విషయం అన్నారు. హీరో సునీల్ మాట్లాడుతూ...బాధలు ఉంటే షేర్ చూసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

    uday kiran

    నటి అపూర్వ మాట్లాడుతూ...వియ్యాల వారి కయ్యాలు సినిమా సమయంలో చూసాను. చాల మంచి వ్యక్తి. అతను ఇలా చేసుకున్నాడంటే...నమ్మలేక పోతున్నాను. ఇకపై ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు, ఏమైనా సమస్య ఉంటే చెప్పుకోవాలి, ఇలాంటి తొందరపాటు పని ఎవరూ చేయొద్దని కోరుకుంటున్నాను అన్నారు.

    గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్న ఉదయ్ కిరణ్....ఆదివారం రాత్రి శ్రీనగర్ కాలనీనలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తన కెరీర్ ఆశాజనకంగా లేక పోవడమే కారణమని తెలుస్తోంది.

    English summary
    Uday Kiran's body shifted to Film Chamber. Dasari Narayana Rao, Chalpathi Rao and other have expressed Condolence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X