హీరోయిన్ వచ్చి ఉదయ్ కిరణ్ పై ఒత్తిడి తెచ్చి...

By Srikanya

Uday Kiran
హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ ఆత్మహత్య విషయంలో రకరకాల కోణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో యాంగిల్ బయిటకు వచ్చింది. గతంలో ఉదయ్ కిరణ్ తో సినిమా చేసే నిమిత్తం ఓ హీరోయిన్ 15 లక్షలు పెట్టుబడి పెట్టిందట. ఆమె వచ్చి రీసెంట్ గా అతనిపై ఆ డబ్బు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసిందని తెలుస్తోంది. ఈ విషయమై డిసిపీ మీడియాకు తెలియచేసారు.

డీసీపీ మాట్లాడుతూ....గతంలో ఉదయ్ కిరణ్ వద్ద మేనేజర్ గా పనిచేసిన మున్నా నిర్మాతగా మారి డామిట్ కథ అడ్డం తిరిగింది సినిమా చెయ్యాలని మొదలెట్టారు. ఇందులో ఓ హీరోయిన్ కూడా 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మధ్యలో ఆగిపోవటంతో సదరు హీరోయిన్ వచ్చి ఉదయ్ కిరణ్ పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై బుధవారం మున్నాని విచారిస్తాం అన్నారు.

అలాగే ఇటీవల చెన్నై లో స్దిరపడదామని భావించిన ఉదయ్ కిరణ్ అక్కడ ఓ ఇల్లు చూద్దామని వెళ్లారు. అయితే ప్రస్తుతం హీరో కాదనే ఉద్దేశ్యంతో ఆ ఇంటి యజమాని ఇల్లు ఇవ్వనని చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. గతంలోనూ కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు ఉదయ్ కిరణ్ తన చేతులు,తొడలపై గాట్లు పెట్టుకున్నారని గుర్తించామని డిసీపీ తెలియచేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X