మద్యం సేవించి ఆత్మహత్య: ఉదయ్ కిరణ్ మిస్టరీ వీడింది

By Bojja Kumar

 Uday Kiran Death Mystery Revealed - Forensic Lab Final Report
హైదరాబాద్: తెలుగు సినిమా యువ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అప్పట్లో ఓ సంచలనం. ఆయన మరణం తర్వాత అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా విడుదలైన ఫోరెన్సిక్ ఫైనల్ రిపోర్టులో ఓ ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించాడని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది.

ఉరి వేసుకోవడంతో ఊపిరి ఆడక అతను ప్రాణాలు వదిలినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్టులో శాస్త్రీయ అధ్యయనం వల్ల మరణాని గల భౌతిక కారణాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అయితే అతన్ని ఆత్మహత్య వైపు పురగొల్పిన మానసిక కారణాలు మాత్రం ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. జనవరి 5న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

అవకాశాలు లేక పోవడం వల్లనే మనో వేదనతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. 'చిత్రం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్, ఆ తర్వాత 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' లాంటి వరుస విజయాలతో హాట్రిక్ విజయం సాధించాడు. దీంతో ఆయనకు లవర్ బాయ్ హీరో అనే ముద్ర పడిపోయింది. ఆ తర్వాత ఆయన వద్దకు ప్రేమ కథలతో కూడిన సినిమాలే రావడం మొదలైంది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి.

దీంతో ఆలోచనలో పడ్డ ఉదయ్ కిరణ్....తాను లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయట పడాలనే ఆలోచనకు వచ్చాడు. మాస్ అండ్ యాక్షన్, ఇతర డిఫరెంటు సినిమాలు కూడా తాను చేయగలను అనే గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉనికి కాపాడు కోవాలన్నా, టాప్ రేంజికి ఎదగాలన్నా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే ఉత్తమ మార్గమనే ఆలోచనుకు వచ్చాడని తెలుస్తోంది. అందుకే ఆయన మామూలు ప్రేమకథా చిత్రాలను తిరస్కరించడం మొదలు పెట్టాడు. మాస్, యాక్షన్ కథాంశాలు చేసినా అవి ప్లాపవడంతో మనో వేదనకు గురవుతూ వచ్చాడని స్పష్టమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X