ఉదయ్ కిరణ్ మృతి: నేత్ర దానం

By Srikanya

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ మృతి చెందటంతో అతని కళ్లని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేసారు. ఎల్వీ ప్రసాద్ వైద్యులు ఈ రోజు (సోమవారం)ఉదయం ...ఉదయ్ కిరణ్ ...నేత్రాలలోని రెటీనాను సేకరించారు. ఆయన లేకపోయినా తన కళ్లతో వేరొకరికి చూపుని ఇచ్చి సజీవంగా ఆయన నిలిచారు.

ఇక హీరో ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్యపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. ఆయన భార్య, అత్తమామలు, అపార్టమెంట్‌ వాచ్‌మెన్‌లను ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అపార్టమంట్‌ వాసుల నుంచి ఏసీపీ అశోక్‌కుమార్‌ వివరాలు సేకరించారు. ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్యకు ముందు మిత్రులకు ఎస్‌ఎంఎస్‌లు చేసినట్లు సమాచారం.

 Uday Kiran Donates his eyes to LV Prasad Hospital

ఆదివారం అర్ధరాత్రి దాటాక జూబ్లీహిల్స్‌లోని తన సొంత ప్లాట్‌లో ఉరి వేసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఉదయ్‌కిరణ్ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమంటూ ఓ లేఖ లభ్యమైనట్లు తెలిసింది. తను నటించిన తొలి సినిమా 'చిత్రం'. 'నువ్వునేను' సినిమాలో ఉత్తమ నటనకు గాను 2011లో ఫిలింఫేర్ అవార్డు పొందారు.

నువ్వునేను, మనసంతానువ్వే, శ్రీరాం చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఉదయ్‌కిరణ్ తమిళంలో కూడా నటించాడు. మొత్తం 19 సినిమాలలో నటించాడు. ఉదయ్‌కిరణ్‌ను జూబ్లీహిల్స్ అపోలకు తరలించారు.హీరో తరుణ్, శ్రీకాంత్ మరియు తదితరులు ఆస్పత్రికి వచ్చారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చాలా విషాదకరం అని , ఎలాజరిగిందో తెలియదుఅని, స్నేహితుల ద్వారా తెలిసిందని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X