నిర్మాతకు ట్విస్ట్ ఇస్తే అంతే మరి

ఇక ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ తన తండ్రితో దెబ్బలాడి ఆత్మహత్యకు దిగుతాడు. ఆ సమయంలో రక్షించిన వ్యక్తి కొంత డబ్బు ఇచ్చి కావల్సి వచ్చినప్పుడు చచ్చిపోయేలా మాట తీసుకుంటాడు. ఈ లోగా మన హీరో తో ఓ హీరోయిన్ ప్రేమలో పడుతుంది. . కానీ హీరో ఆ ప్రేమను ఒప్పుకోడు. అయితే స్నేహితులు ధైర్యం చెబితే ఆ విలన్ లాంటి వ్యక్తికి ఎదురుతిరుగుదామని బయిలు దేరతాడు. కానీ ఆ పని చెయ్యడు. ఎందుకంటే అదో సస్పెన్స్. ఆ అమ్మాయే...అదీ విషయం.
ఇక ఈ సినిమా షూటింగ్ కి అటెండు కాకుండా ఉదయ్ కిరణ్ ...నిర్మాతతో గొడవలు పడ్డాడు. మొదటే అతనికి ఫ్లాఫ్ అవుతుందనే నమ్మకం ఉండటం వల్ల చాలా నిర్లక్ష్యంగా ఈ సినిమా పూర్తి చేసినట్లు స్పష్టంగా కనపడుతుంది. అలాగే అనుకున్నట్లుగానే ఓపెనింగ్స్ కూడా ఈ సినిమాకు సరిగా లేవు. మరో ప్రక్క దీనితో పాటే రిలీజయిన యువత మంచి రిపోర్టు రావటం జరిగింది. బ్యాడ్ కదా..అయినా కథ నచ్చకపోతే మొదటే ప్రాజెక్టు రిజెక్టు చేయాలి గాని ...సగంలో రియిలైజ్ అయి డబ్బు పెట్టే నిర్మాతకు ట్విస్ట్ ఇస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి. భవిష్యత్ లోనూ మరో నిర్మాత ముందుకు రావటానికి పదిరకాలుగా ఆలోచిస్తాడన్నది నిజం.


Click it and Unblock the Notifications











