ప్రేమించిన అమ్మాయితో ఉదయ్ కిరణ్ వివాహం

By Srikanya

హైదరాబాద్ : హీరో ఉదయ్‌ కిరణ్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కి చెందిన విశితను ఉదయ్‌ ప్రేమించారు. వారిద్దరి ప్రేమనీ ఇరు కుటుంబాల వారూ అంగీకరించి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 24న ఉదయ్‌, విశితల వివాహం జరగబోతోంది. వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ వివాహంతో తన దశ తిరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'జై శ్రీరామ్‌' అనే చిత్రంతో కొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు.

ఉదయ్ కిరణ్ ఈ విషయమై మాట్లాడుతూ... ''ఓ పుణ్యక్షేత్రంలో పెళ్లి చేసుకోబోతున్నాను. నిరాడంబరంగా ఆ వేడుక ఉంటుంది'' అని తెలిపారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన 'చిత్రం'తో హీరోగా ఉదయ్‌ తొలి అడుగువేశారు. ఆ తరవాత 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే'లాంటి చిత్రాలతో దూసుకెళ్లారు. ఆ తరవాత కెరీర్‌పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఉదయ్ కిరణ్ సెకండ్ ఇన్నింగ్స్ తరహాలో మొదలెట్టి చేస్తున్న చిత్రం 'జై శ్రీరామ్‌'. రేష్మ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి బాలాజీ ఎన్‌.సాయి దర్శకత్వం వహిస్తున్నారు. తేళ్ల రమేష్‌, ఎన్‌.సి.హెచ్‌.రాజేష్‌ నిర్మాతలు. దర్శకుడు మాట్లాడుతూ ''ప్రాణాల్నిపణంగా పెట్త్టెనా అనుకొన్నది సాధించే పోలీసు అధికారి పాత్రలో ఉదయ్‌కిరణ్‌ ఒదిగిపోయారు. యాక్షన్‌, వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది''అన్నారు.

ఇక ఈ చిత్రం స్టోరీ గురించి హీరో ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ...ఎక్కడ అన్యాయం జరుగుతోందంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు శ్రీరామ్‌. నేరస్తుల పాలిట సింహ స్వప్నం. అవసరమనుకొంటే నియమ నిబంధనల్ని పక్కనపెడతాడు. వృత్తి తప్ప మరో వ్యాపకం తెలియని ఆ అధికారి జీవితంలోకి ఓ యువతి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆ తరవాత శ్రీరామ్‌కి వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? లాంటి విషయాల్ని తెరపైనే చూడాలంటున్నారు.

అలాగే ''ఇప్పటివరకూ వచ్చిన పోలీస్ కథలకు పూర్తి భిన్నంగా 'జై శ్రీరామ్' ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్రధానబలం. లవ్, యాక్షన్, సెంటిమెంట్... ఇలా అన్ని ఎలిమెంట్లూ ఇందులో ఉంటాయి. పతాక సన్నివేశాల్లో నా లుక్ చాలా సర్‌ప్రైజింగ్ ఉంటుంది. సింహా, దూకుడు, ఈగ చిత్రాల్లో నటించిన ఆదిత్య మీనన్ ఇందులో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. విలన్ తండ్రిగా ఓ ప్రముఖ నటుణ్ణి సర్‌ప్రైజింగ్‌గా పరిచయం చేస్తున్నాం'' అని ఉదయ్‌కిరణ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X