మీ పెద్దోళ్లున్నారే...
తాజాగా 'మీ పెద్దోళ్లున్నారే...' అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఆ డైలాగ్ చెప్పిన ఉదయ్ కిరణే ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు. ఈ చిత్రానికి వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'మనసంతా నువ్వే' 'శ్రీరామ్' అనే చిత్రాలు రూపొందాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్కు పూర్తయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాల తర్వాత సరైన హిట్ లేని ఉదయ్ కిరణ్ దాదాపు పదేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యలో ఓ డజను సినిమాల్లో నటించినా ఫలితం లేక పోయింది. ఉదయ్ కిరణ్ చివరి సారిగా నటించిన 'గుండు జల్లుమంది', 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఉదయ్ కిరణ్ అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్లలో తప్ప తెరపై కనిపించడమే మానేసాడు.
విఎన్ ఆదిత్య చివరగా తెలుగులో దర్శకత్వం వహించిన రెయిన్ బో, ముగ్గురు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. మరి ప్లాపుల బాటలో ఉన్న ఉదయ్ కిరణ్, విఎన్ ఆదిత్య కలయిక ఏమైనా వర్కౌట్ అవుతుందో? లేదో చూడాలి.


Click it and Unblock the Notifications












