For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ పెద్దోళ్లున్నారే...

    By Bojja Kumar
    |
    ఉదయ్ కిరణ్ హీరోగా అప్పట్లో వచ్చిన 'నువ్వు నేను' చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల ప్రేమకు వాళ్ల పెద్దవాళ్లు అంగీకరించక పోవడంతో....'మీ పెద్దోళ్లు ఉన్నారే...మా చిన్నోళ్ల ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోరు' అంటూ ఉదయ్ కిరణ్ చెప్పిన డైలాగ్ బాగా పాపురల్ అయింది.

    తాజాగా 'మీ పెద్దోళ్లున్నారే...' అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఆ డైలాగ్ చెప్పిన ఉదయ్ కిరణే ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు. ఈ చిత్రానికి వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'మనసంతా నువ్వే' 'శ్రీరామ్' అనే చిత్రాలు రూపొందాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్కు పూర్తయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

    చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాల తర్వాత సరైన హిట్ లేని ఉదయ్ కిరణ్ దాదాపు పదేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యలో ఓ డజను సినిమాల్లో నటించినా ఫలితం లేక పోయింది. ఉదయ్ కిరణ్ చివరి సారిగా నటించిన 'గుండు జల్లుమంది', 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఉదయ్ కిరణ్ అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్లలో తప్ప తెరపై కనిపించడమే మానేసాడు.

    విఎన్ ఆదిత్య చివరగా తెలుగులో దర్శకత్వం వహించిన రెయిన్ బో, ముగ్గురు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. మరి ప్లాపుల బాటలో ఉన్న ఉదయ్ కిరణ్, విఎన్ ఆదిత్య కలయిక ఏమైనా వర్కౌట్ అవుతుందో? లేదో చూడాలి.

    English summary
    
 Uday Kiran is facing tough time with continuous flops. Even though his first three films were runaway hits, Uday Kiran failed to live up to the expectations after that. Now, the actor is coming with his next film titled as 'EE Peddollunnare..!’ The movie is being directed by VN Aditya. The movie has completed its pre production work and getting ready to hit the floors soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X