ఉగాదికి ఉదయ్ కిరణ్ ‘జై శ్రీరామ్’

By Bojja Kumar

హైదరాబాద్: ఉదయ్ కిరణ్, రేష్మ జంటగా బాలాజీ ఎన్.సాయి దర్శకత్వంలో మల్టీ డైమన్షన్స్ సమర్పణలో ఫైవ్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తేళ్ల రమేష్, ఎన్.సి.హెచ్. రాజేష్ నిర్మిస్తున్న చిత్రం 'జై శ్రీరామ్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 11న విడుదలకు సిద్ధం అవుతోంది.

దర్శకుడు మాట్లాడుతూ...'ఇప్పటి దాకా చూడని ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో చూస్తారు. ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. పోలీసాఫీసర్ గా ఆయన గెటప్ కు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. లవర్ బాయ్ ఇమేజ్ క్యారీ చేస్తూనే అప్పట్లో 'శ్రీరామ్' చిత్రంలో యాక్షన్ వైజ్‌గా కూడా నిరూపించుకున్నారు. పగ ప్రతీకారాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది' అని తెలిపారు.

ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ 'ఇప్పటి వరకు అన్ని లవర్ బాయ్ పాత్రలే చేసాను. ఇందులో తొలిసారిగా యాక్షన్ హీరోగా కొత్త బాణీలో కనిపించబోతున్నా. ఈ పన్నెడేళ్ల కెరీర్లో నేను ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో నా కెరీర్ మళ్లీ మలుపు తిరుగుతుంది' అని ఆశాభావం వ్యక్తం చేసారు.

నిర్మాతలు మాట్లాడుతూ....ఉదయ్ కిరణ్ లోని మాస్ యాంగిల్ చూపించే చిత్రం ఇది. కొత్త ఉదయ్ ని చూస్తారు. శక్తివంతమైన పోలీసాపీసర్ గా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా తను చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తాయి. ఒక్క క్లైమాక్స్ ఫైట్‌కే కజ. 40 లక్షలు ఖర్చుపెట్టి రష్యా నుంచి స్పెషల్ లెన్సులు తెప్పించాం. కథ డిమాండ్ చేసిన మేరకు భారీగా ఖర్చు పెట్టాం. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి' అన్నారు. హరీష్, కళ్యాణ్, ఆదిత్య మీనన్, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, అలీ, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డాకె, కెమెరా: అక్కినేని వెంకట్, ఆరిఫ్, ఆర్ట్: భాస్కర రాజు, పాటలు: వరప్రసాద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X