పోలీస్ ఆఫీసర్ గా ఉదయ్ కిరణ్
దర్శకుడు బాలాజీ.ఎన్.సాయి మాట్లాడుతూ... ఉదయ్ కిరణ్ తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్ నేపథ్యంలో చేస్తున్న యాక్షన్ సినిమా ఇది. ఇందులో ఆయన కత్తిలాంటి పదునైన క్రైమ్‌బ్రాంచ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఇప్పటివరకూ తను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. లవ్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ల కలబోత ఇది. ఇందులో మొత్తం '5' పాటలుంటాయి'' అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ- "ఈ నెల 18న తొలి షెడ్యూలు మొదలైంది. నెలాఖరు వరకూ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ షెడ్యూలులో 2 పాటలు, కీలకమైన సన్నివేశాలు, 2 యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తాం. సంగీత దర్శకునిగా డాఖేను పరిచయం చేస్తున్నాం'' అని తెలిపారు. నాగినీడు, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, గిరిధర్, పృథ్వీ, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా, టెక్నికల్ సపోర్ట్: డిజీ పోస్ట్, ఆర్ట్: భాస్కరరాజు, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, సహనిర్మాత: ఎం.సి.హెచ్.రాజేష్.


Click it and Unblock the Notifications












