పాపం ఉదయ్ కిరణ్ కి ఆ సిట్యువేషన్ ...

By Srikanya

బయిట నిర్మాతలెవ్వరూ తమతో చెయ్యటానకి రానప్పుడు సాధారణంగా హీరోలు తమ సొంత బ్యానర్ పెట్టి సినిమాలు ప్లాన్ చేస్తూంటారు. ఇప్పుడదే పరిస్ధితి ఉదయ్ కిరణ్ కి ఎదురైంది. అతని సినిమాలు వరసగా ఫెయిల్యూర్ కావటంతో అతనికి ప్రొడ్యూసర్స్ కరువయ్యారు. ఈ సిట్యు వేషన్ లో అతడి మరో సినిమా 'దిల్ కబడ్డి' షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. సముద్ర వద్ద పనిచేసిన శ్రీ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమా నిర్మాత ఎవరూ అంటే శివకుమార్. శివకుమార్ ఎవరూ అంటే ఉదయ్ కిరణ్‌కి క్లోజ్ ప్రెండ్. ఉదయ్ కిరణ్ తనే స్వయంగా డబ్బులు పెట్టుబడి పెడుతూ ఇలా సినిమా స్టార్ట్ చేసాడు. అంతేగాక ఇకనుంచీ తనకి గ్యాప్ రాదనీ, వరసగా సినిమాలు చేస్తాననీ అతను చెప్పుకొచ్చాడు కూడా. ఇక అతని 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' చిత్రం పూర్తయి చాలా రోజులైనా ఇంతవరకు ఈ సినిమా ప్రేక్షకుల మధ్యకు రాలేకపోయింది. ఉదయ్ సినిమా అంటే బిజినెస్ జరగకపోవటమే కారణమంటున్నారు.అదీ సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X