హీరో ఉదయ్ కిరణ్‌కు దెబ్బ మీద దెబ్బ!
చిత్రం, మనసంతా నువ్వే, నువ్వునేను లాంటి హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్ సినీ కెరియర్ ప్రస్తుతం ఉంటుందా? ఊడుతుందా అనే చందంగా కొట్టు మిట్టాడుతోంది. వరుస ప్లాపులతో పాటు...ఓ పెద్ద హీరో కూతురుతో జరిగిన నిశ్చితార్థ వ్యవహారం బెడిసి కొట్టడమే ఉదయ్ కిరణ్ ఈ పిరిస్థతికి కారణమని పరిశ్రమ వర్గాల గుసగుస.
ఆ విషయం పక్కన పెడితే ఉదయ్ కిరణ్-శ్వేత బసు ప్రసాద్ నటించిన 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' సినిమా ఈ నెల డిసెంబర్ 16న విడుదల కావాల్సి ఉండగా విడుదలకు నోచుకోలేదు. సినిమా థియేటర్లలో పోస్టర్లు వేసిన తర్వాత కూడా చివరి నిమిషంలో వాయిదా వేశారు. వాస్తవానికి ఈ సినిమా గతంలో ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కొన్ని అసుకోని కారణాలతో కాలేదు. అయితే ఈ సారి కూడా మరోసారి వాయిదా పడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే దెబ్బమీద దెబ్బ రుచి చూసిన ఉదయ్ కిరణ్ కు ఈ వాయిదా అతని సినీ కెరియర్‌కి మరో దెబ్బలాంటిదే అంటున్నారు.
సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈశ్వర్ ప్రసాద్, డి కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సుభా సెల్వన్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











