ఉదయ్ కిరణ్ ఆఖరి మూవీ ‘చిత్రం చెప్పిన కథ’ టీజర్

By Bojja Kumar

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. 'నువ్వునేను' ఫేమ్ అనిత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్, గరిమ, మదాలస శర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఏయల్లార్కే దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ విడుదల చేసారు

దర్శకుడు మాట్లాడుతూ...ఈ సినిమాకు ఉదయ్ కిరణ్, మున్నా, స్క్రిప్ట్ రైటర్ నరేష్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్‌కి నివాళి ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు. మల్టీడైమన్షన్ వాసు మాట్లాడుతూ 'ఈ సినిమా చక్కని ఎలిమెంట్స్ తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ. కచ్చితంగా సినిమా హిట్టై ఉదయ్ కిరణ్ కి మంచి పేరు తీసుకొచ్చి ఉండేది. తను మన మధ్య లేకపోవడం బాధాకరం. టీజర్ చాలా బాగుంది. మున్నాకాశీ మంచి సంగీతం ఇచ్చాడు అన్నారు.

Uday Kiran’s Chitram Cheppina Katha

ఉదయ్ చేతుల మీదుగా టీజర్ విడుదలచేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఈ నెల చివర్లో ఆడియో రిలీజ్ చేసి వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీడైమన్షన్ వాసు, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, దేవీప్రసాద్, కాదంబరి కిరణ్, సంగీత దర్శకుడు మున్నా కాశీ, నిర్మాత కాశీ, దర్శకుడు మోహన్ ఏయల్లార్కే పాల్గొన్నారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/xsTKBrBE5Ak?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X