ఉదయ్ కిరణ్ మృత దేహం..ఎవరూ తీసుకు వెళ్లలేదు
హైదరాబాద్ : ఉదయకిరణ్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు పోస్ట్ మార్టం పూర్తి చేసారు. అయితే ఆయన మృత దేహం తీసుకు వెళ్లేందుకు ఇంతవరకూ ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఉస్మానియాకు రాలేదు. ఉదయ్ కిరణ్ అక్క మస్కట్ లో ఉంటోంది. ఆయన తండ్రి హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

మరోవైపు ఉదయ్ కిరణ్ భార్య సైతం అతని మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఆస్పత్రికి రాకపోవటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఇదిలా ఉండగా కుటుంబ సభ్యులు వచ్చేవరకూ మృత దేహాన్ని నిమ్స్ హాస్పటిల్ మార్చరీకి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
అయితే మార్చురీకి తాళం వేసి ఉంచటంతో సుమారు ఇరవై నిముషాలు సేపు మృత దేహాన్ని బయిటే ఉంచారు. కాగా ఉదయ్ కిరణ్ అంత్య క్రియలు మంగళవారం పంజాగుట్ట స్మశానంలో జరగ నున్నట్లు సమాచారం. ఆదివారం అర్థరాత్రి హీరో ఉదయ్‌కిరణ్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











