ఉదయ్ కిరణ్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న సినీ నటుడు ఉదయ్ కిరణ్ మృత దేహానికి ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి పోరెన్సిక్ రిపోర్టు తయారు చేసారు. ఫోరెన్సిక్ రిపోర్టులో పలు షాకింగ్ విషయాలు బయట పెట్టారు వైద్యులు. గతంలో రెండు సార్లు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు వైద్యులు గుర్తించారు.
అతని ఎడమచేతి మణికట్టుపై బ్లేడుతో కోసుకున్నట్లు పాత గుర్తులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆదివారం రాత్రి 10.30 నుంచి 11 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఫోరెన్సిక నివేదిక ఇంకా పోలీసులకు సమర్పించలేదని ఉస్మానియా ఫోరెన్సిక్ డాక్టర్ అమ్మాణీ తెలిపారు.
ఫోరెన్సిక్ నివేదికలోని అంశాలను పరిశీలిస్తే.....ఉదయ్ కిరణ్ చాలా సున్నిత మనస్తత్వం కలవాడని, తన మనసు తట్టుకోలేని పరిస్థితులు ఎదురైతే ఆత్మహత్యకు ప్రయత్నించే రకమని, గతంలో రెండు సార్లు ఆయన ఆత్మహత్య ప్రయత్నాలు చేసినట్లు వైద్యులు గుర్తించడాన్ని బట్టి స్పష్టం అవుతోంది.
1980 జూన్ 26న జన్మించిన ఉదయ్ సికింద్రాబాదులోని వెస్లీ కళాశాలలో చదువుతున్న రోజుల్లో మోడలింగ్ వైపు వెళ్లారు. ఆ తర్వాత చిత్రం సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఉదయ్ కిరణ్ 2012 అక్టోబర్ 24న విషితను పెళ్లి చేసుకున్నారు. జనవరి 5వ తేదీ రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications












