ఉదయ్ కిరణ్ ఆత్మహత్య: అద్దె బకాయి, తట్టుకునేవాడుకాదు!

By Bojja Kumar

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు రోజులు గడుస్తున్న కొద్దీ వెలుగలోకి వస్తున్నాయి. అవకాశాలు లేక పోవడం వల్లనే ఉదయ్ కిరణ్ మానసికంగా కృంగి పోయారని తెలుస్తోంది. ఒక్క చాన్స్ అంటూ ఎంతో మంది దర్శకులు, నిర్మాతల చుట్టూ ఉదయ్ కిరణ్ చర్కర్లు కొట్టినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది.

కొంత కాలం చెన్నై వెళ్లి అక్కడ తమిళ సినిమాల్లో అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేసాడని, అయినా ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదని, కొందరైతే నువ్వెవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తించారని, దీంతో ఉదయ్ కిరణ్ తీవ్రంగా బాధపడేవాడని తెలుస్తోంది. ఇలా మానసికంగా కృంగి పోయిన ఉదయ్ కిరణ్.....తన ముందు వేరొక నటుడిని పొగిడితే తట్టుకోలేనంతగా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయేవాడని తెలుస్తోంది.

 Uday Kiran

దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఆయన్ను బంధువులు, స్నేహితులు ఎవరూ కలవక పోవడం, కృంగి పోతన్న తనను ఓదార్చే వారు లేక పోవడం లాంటి పరిస్థితులు కూడా ఆయన్ను ఆత్మహత్య వైపు మళ్లించాయని తెలుస్తోంది. మరో వైపు తాను నివాసం ఉంటున్న ఇంటికి ఆరు నెలలుగా అద్దు బాకీ ఉన్నాడని, భార్య సంపాదనపై బ్రతకాల్సి వస్తోందని తీవ్రమానసిక సంఘర్షణలకు లోనయ్యే వాడని తెలుస్తోంది.

అవకాశాలు లేక పోవడం, అయిన వారి ఓదార్పు లేక పోవడం, స్నేహితులు సన్నిహితులు కూడా ఆయనకు దూరంగా ఉండటం.........ఇలాంటి పరిణామాలెన్నో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ ఆత్మహత్యను తెలుగు సినీ అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X