ఉదయ్ కిరణ్ మృతిపై విషిత తండ్రి ఖండన

By Srikanya

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ ఆత్మహత్య విషయమై అతని మామగారు (భార్య తండ్రి) గోవింద్ రాజన్ స్పందించారు. కుటుంబ కలహాలు ఉన్నాయనే మాటను ఆయన ఖండిచారు. తమ మధ్య ఎలాంటి కుటుంబ కలహాలు లేవని ఆయన మీడియాకు తెలియచేసారు. తమ అల్లుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్దం కావటం లేదన్నారు. అతనికి ఆర్దిక ఇబ్బందులు లేవని, అయితే చిత్ర పరిశ్రమలో తాను ఒంటిరి అని బాధపడుతూండేవరాని అన్నారు.

కెరీర్ విషయంలో ఉదయ్ కిరణ్ చాల నిరాశ,నిస్పృహలతో ఉన్నారని అన్నారు. ఇక భార్య భర్తల మధ్య గొడవల విషయానికి వస్తే..అలాంటి వివాదాలు చాలా అతి సాధారణమని, అవి గొడవలు అనలేమని వాఖ్యానించారు. ఉదయ్ కిరణ్ కి తన కుమార్తె విషిత మధ్య ఏ గొడవలు లేవని స్పష్టం చేసారు.

అసలు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉంటే తాము అతన్ని ఒంటిరిగా వదిలి వెళ్లేవాళ్లమే కాదని ఆయన అన్నారు. అప్పటివరకూ అందరం కలిసే సినిమా చూసామని, ఆ తర్వాతే బర్తడే పార్టీకి వెళ్లామని అన్నారు. ఇక ఉదయ్ కిరణ్ కి అతని తండ్రికి గతంలో ఏవో గొడవలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఉదయ్ కిరణ్ తండ్రి సెకండ్ మ్యారేజ్ చేసుకోవటంతో వారి మధ్య సంభంధాలు లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X