ఉదయ్ కిరణ్ భార్య‌ గంధరగోళం, పోలీసుల అనుమానం!?

By Bojja Kumar

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ ఆత్మహత్య విషయంలో పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుపుతున్నారు. వారు చెబుతున్న వివరాలను పరిశీలిస్తే.....ఉదయ్ కిరణ్ భార్య విషితపై వారు అనుమాన పడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆమె చెబుతున్న విషయాలు గంధరగోళంగా ఉండటమే ఇందుకు కారణం.

అఫ్ కోర్స్....అనుమానించడం పోలీసులు విధి నిర్వహణలో భాగమే అనుకోండి. అయితే అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అందరినీ విచారించిన తర్వాతే ఏ విషయమనేది క్లారిటీగా చెబుతామని పోలీసులు అంటున్నారు. మరి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనక కారణాలను పోలీసులు విచారణలో ఏ మేరకు బయట పడతాయో చూడాలి.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య విషయమై వెస్ట్ జోన్ డీసీపీ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ....టీం ఆఫ్ డాక్టర్స్ ఉదయ్ కిరణ్‌ది ఆత్మహత్యే అని ప్రాథమికంగా తేల్చారని తెలిపారు. ఉరి వేసుకోవడం ద్వారా మరణించినట్లు తేలిందన్నారు. తాము పూర్తి స్థాయి నివేదిక పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.

ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తమకు తెలిసిన వివరాల ప్రకారం అవకాశాలు లేక పోవడం, గౌరవం లేక పోవడం, ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా అప్పటికప్పుడు అంత త్వరగా ఆత్మహత్య చేసుకోవడానికి గల బలమైన కారణమేంటనేది తెలుసుకునే ప్రయత్నేం చేస్తున్నామన్నారు.

ఉదయ్ కిరణ్ కేసు విషయంలో రెండు టీంలు పని చేస్తున్నాయని తెలిపారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఉదయ్ కిరణ్ భార్య విషిత, అత్తమామలను డీటేల్డ్‌గా విచారణ జరుపుతామని తెలిపారు. నిన్న ప్రచారం జరిగినట్లుగా....ఉదయ్ కిరణ్ ఫోన్ నుంచి 'ఐ లవ్ యూ' అనే మెసేజ్ ఏమీ వెళ్లలేదని, భూపాల్ అనే వ్యక్తితో కూడా మాట్లాడలేదని డీసీపీ తెలిపారు.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఉదయ్ కిరణ్ ఫోన్ నుండి మొత్తం 4 కాల్స్ వెళ్లాయని...అందులో రెండు కాల్స్ భార్య విషితకు, రెండు కాల్స్ శరత్ అనే కుర్రాడికి వెళ్లినట్లు తెలిపారు. శరత్ అనే వ్యక్తి విషితకు క్లాస్ మేట్ అని, ఫ్రెండ్ అని తమకు తెలిసిందని తెలిపారు. ఉదయ్ కిరణ్ చేతిపై గతంలో బ్లేడుతో కోసుకున్నట్లుగా గుర్తులు ఉన్నాయని తెలిపారు.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న రోజు విషిత అర్ధరాత్రి వరకు ఫ్రెండ్ రోహిత్ ఫంక్షన్‌కి వెళ్లిందని తెలిపారు. ఆత్మహత్య జరిగిన 15 నిమిషాల్లోగా భార్య విషిత, అత్తమామలు సంఘటన స్థలానికి చేరుకున్నారని, ఉరి వేసుకున్న ఉదయ్ కిరణ్ బాడీని దించేసి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారని......ఈ కారణంగా సంఘటన స్థలంలో ప్రాథమిక ఆధారాల సేకరించే అవకాశం పోలీసులకు లేకుండా పోయిందని తెలిపారు. ఎలాంటి సూసైడ్ నోట్ తమకు లభించలేదని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఏ విషయమనేది తేలుస్తామని డీసీపీ స్పష్టం చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X