ఉదయ్ కిరణ్ కెరీర్ కొత్త మలుపు
ఉదయ్ కిరణ్ ఒకేసారి రెండు సినిమాలు చేయబోతున్నారు. ఒకటి తెలుగులోనూ, ఇంకొకటి తమిళంలోనూ. ఈ రోజు (శుక్రవారం) తెలుగు సినిమా మొదలవుతుండగా ఆదివారంనాడు తమిళ చిత్రం ప్రారంభమవుతోంది. తెలుగులో శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళంలో మీరాజాస్మిన్ నాయికగా జతకడ్తున్నారు. ఇవి రెండూ రెండేనని, కథపరంగాను...మేకింగ్ పరంగాను గొప్ప సినిమాలు కానున్నాయని ఉదయ్ చెప్పాడు.
శుక్రవారం జన్మదినం ఈ శుభ సందర్భంలో రెండు చిత్రాలు మొదలవుతుండటం చాలా ఆనందంగా ఉందని ఉదయ్ చెప్పారు. తన కెరీర్ బ్రైట్‌గా మారడానికి ఈ రెండు చిత్రాలూ దోహదం చేస్తాయని ఆయనన్నారు. తమిళంలో రూపొందే చిత్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కథను సమకూర్చడం తన అదృష్టమని ఉదయ్ పేర్కొన్నారు. కొత్త బ్యాక్ డ్రాప్ తో ఆ చిత్రం సాగుతుందని తెలిపారు.
ఇక తెలుగులో రూపొందే చిత్రం 'డీప్ సెన్స్'తో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఉంటుందని ఆయన చెప్పారు. పరిశ్రమ ఇప్పుడు బాగుందని, ఎక్కువ సినిమాలు ఈ జూన్ నెలలో మొదలయ్యాయని, అందరూ బిజీబిజీగా వర్క్‌లో ఉన్నారని ఉదయ్ చెబుతూ ఇక అందరికీ మంచి రోజులే రానున్నాయని అన్నారు. బర్త్ డే గురించి మాట్లాడుతూ -"ప్రతి బర్త్ డేకి చిన్న ఆనందం ఉంటుంది. అభిమానులు ఆర్టిస్టులను గుర్తుచేసుకునే రోజు ఇది" అన్నాడు.


Click it and Unblock the Notifications