డైరెక్టర్‌తో ఎఫైర్‌పై...ఉదయ భాను స్పందన
ఇటీవల ఇద్దరూ ఔటర్ రింగ్ రోడ్డులో సరదాగా ఓ ట్రిప్ వేసి వస్తూ కారు ప్లాబ్లం రావటంతో ఈ విషయం బయిటకి పొక్కిందని టీవీ ఛానళ్లలో సైతం ప్రచారం జరిగింది. అయితే తనపై వస్తున్న ఈ రూమర్లపై ఉదయభాను ఎట్టకేలకు స్పందించింది. తమ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది.
తన వివరణ తీసుకోకుండా మీడియా తనపై ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడంపై ఉదయభాను మండి పడింది. మరోసారి ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ప్రస్తుతం వీరభద్రం నాగార్జున హీరోగా నటించనున్న 'భాయ్' చిత్రం స్క్రిప్టు వర్క్ లో ఉన్నారు.
ఇక ఉదయభాను విషయానికొస్తే సినిమాల్లో ఐటం గర్ల్ గా సెటిలవ్వుదామనే ఉద్దేశ్యంతో ఉదయభాను ఈ మధ్య పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేసి అందాలు ఆరబోత కార్యక్రమం చేపట్టింది. అయితే ఆమె ఐటం సాంగులకు ఆడియన్స్ నుంచి సరైన స్పందన రాక పోవడంతో...మళ్లీ బుల్లితెర కార్యక్రమాల్లో బిజి అయిపోయింది ఈ లోకల్ బ్యూటీ.


Click it and Unblock the Notifications












