twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేణు మాధవ్‌కు అన్యాయం.. మళ్లీ పుట్టడంటూ ఉదయభాను కంటతడి

    |

    Recommended Video

    Tollywood Celebrities Pays Homage To Venu Madhav

    నవ్వుల రారాజు వేణు మాధవ్ ఆకస్మిక మృతితో తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది. మరణవార్తతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్‌కు తరలించి సినీ ప్రముఖులంతా శ్రద్దాంజలి ఘటించారు. వేణు మాధవ్‌కు శ్రద్దాంజలి ఘటించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్‌తో భారీగా నటీనటులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వేణు మాధవ్‌ను తలచుకొని కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..

     నాకు బిగ్‌బ్రదర్ లాంటి

    నాకు బిగ్‌బ్రదర్ లాంటి

    వేణు మాధవ్ నాకు బిగ్ బ్రదర్ లాంటి వ్యక్తి. నేను చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చాను. అలాంటి సమయంలో నాకు పరిచయం అయ్యారు. వన్స్‌మోర్ లాంటి షోస్ చేసే అవకాశం లభించింది. అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. అప్పుడు నన్ను సొంతం చెల్లెలా ప్రొటెక్ట్ చేశారు. అన్న ఉన్నారనే ధైర్యం నాకు ఉండేది అని యాంకర్ ఉదయభాను అన్నారు.

    అల్లరిగా సందడిగా

    అల్లరిగా సందడిగా

    షూటింగ్ ఏదైనా కలిసి మెలిసి ఉండే వాళ్లం. ఇంటి నుంచి తెచ్చిన భోజనం క్యారేజ్‌ను షేర్ చేసుకొనే వాళ్లం. కేవలం నాతోనే కాకుండా ఎంతో అనోన్యంగా అందరితో కలిసి ఉండేవారు. వేణు మాధవ్ అన్న ఎక్కడున్నా అల్లరి అల్లరిగా సందడి సందడిగా ఉండేది. ఎలాంటి సందర్బాల్లోనైనా ఆ ప్రాంతమంత నవ్వులతో ఉండేది అని ఉదయభాను కన్నీటి పర్యంతమయ్యారు.

    ఆపదొచ్చినా.. ఆనందమొచ్చినా

    ఆపదొచ్చినా.. ఆనందమొచ్చినా

    ఇక ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా.. ఎవరింట్లోనైనా శుభకార్యం జరిగినా ముందుండేవారు. బంగారం లాంటి వ్యక్తి వేణు మాధవ్ అన్న. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసు. కానీ ఇలా అన్యాయం జరిగిపోతుందని అనుకోలేదు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు అని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు.

    నాకే కాదు.. సినీ పరిశ్రమకు తీరని లోటు

    నాకే కాదు.. సినీ పరిశ్రమకు తీరని లోటు

    వ్యక్తిగతంగా వేణు మాధవ్ మృతి నాకు తీరని లోటు. పరిశ్రమలో ఆయన లోటును మరెవరూ పూడ్చలేనిది. వేణు చేసే క్యారెక్టర్‌‌కు అన్యాయం జరిగిందనే చెప్పాలి. అలాంటి ఆర్టిస్టు మళ్లీ పుట్టడు. వేణు మాధవ్ మృతితో సినీ పరిశ్రమ చిన్నబోయిందనే అనుకోవాలి అని ఉదయభాను పేర్కొన్నారు.

    English summary
    Comedian Venu Madhav died at Yashoda Hospital of Secunderabad. He has been under going treatment for Kidney failure and Liver related issues from few days. Many celebrities condolenced to Senior artist at Film Chamber.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X