స్టార్ హోటల్‌లో యాంకర్ ఉదయభాను గ్రాండ్ పార్టీ.... ఎందుకో తెలుసా?

ఉదయభాను గ్రాండ్ పార్టీ ఇవ్వబోతోంది. కూతుళ్ల పుట్టినరోజు వేడుక నిర్వహించబోతోంది.

By Bojja Kumar

బుల్లితెర యాంకర్ ఉదయభాను ఈ మధ్య టీవీ షోలలో కనిపించడం చాలా తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే ఆమె కొన్ని ఆడియో వేడుకలలో కనిపిస్తున్నారు. బుల్లితెరకు ఆమె దూరం కావడానికి కారణం సంవత్సరం క్రితం ఆమె ఇద్దరు కవలలకు జన్మనివ్వడమే.

తాజాగా ఉదయభాను ఓ హాట్ న్యూస్‌తో వార్తల్లోకి ఎక్కారు. త్వరలో ఆమె హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని స్టార్ హోటల్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇవ్వబోతున్నారట. ఈ పార్టీకి టీవీ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరవుతున్నట్లు సమాచారం.

ఏమిటి విశేషం

ఏమిటి విశేషం

ఎన్నడూ లేనిది ఉదయభాను ఇంత భారీ ఎత్తున పార్టీ ఇవ్వడానికి కారణం...... తన ఇద్దరు కవల పిల్లల తొలి పుట్టినరోజు కావడమే. సెప్టెంబర్ 3న వేడుక జరుగనున్నట్లు సమాచారం.

Recommended Video

Goutham Nanda Movie Audio Launch : Udaya Bhanu Got Shocked
ఉదయభాను కూతుళ్ల పేర్లు

ఉదయభాను కూతుళ్ల పేర్లు

ఉదయభాను ఇద్దరు కూతుర్లలో ఒకరికి యువి నక్షత్ర, మరొకరికి భూమి ఆరాధ్య అనే పేర్లు పెట్టారు. గత సంవత్సర కాలంగా ఉదయభాను ఎంటర్టెన్మెంట్ రంగానికి దూరమై కూతుళ్ల పెంపకంపైనే దృష్టిపెట్టింది.

ఉదయ భాను ప్రేమ వివాహం

ఉదయ భాను ప్రేమ వివాహం

ఉదయభాను వివాహం విజయ్ కుమార్ తో 2004లో జరిగింది. ఇద్దరిదీ ప్రేమ వివహం. లైఫ్ లో సెటిలయ్యాకే పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకున్న ఈ ఇద్దరూ...ఆర్థికంగా కాస్త స్థిరపడ్డ తర్వాత గతేడాది తల్లిదండ్రులయ్యారు.

ఉదయభాను జీవితంలో జరుగుతున్న అతి పెద్ద వేడుక

ఉదయభాను జీవితంలో జరుగుతున్న అతి పెద్ద వేడుక

ఉదయభాను జీవితంలో జరుగుతున్న అతిపెద్ద వేడుక ఇదే. ఉదయభాను ప్రేమ వివాహం అప్పట్లో చాలా సింపుల్‌గా జరిగింది. అందుకే ఈ సారి కూతుళ్ల పుట్టినరోజు వేడుక చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X