జులాయి చేతుల్లో ఉదయభాను... భవిష్యతేంటి?
యాంకర్ ఉదయ భాను జులాయి చేతుల్లో పడింది. జులాయి చేతుల్లో పడటం అంటే ఇంకేదో అనుకోవద్దు. అమ్ముడు అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'జులాయి' చిత్రం టైటిల్ సాంగులో స్టెప్పులేసింది. ఇందులో ఆమె అందాలు హాట్ హాట్‍గా ఆరబోయనుందని తెలుస్తోంది.
గతంలో కొండవీటి సింహాసనం చిత్రంలో ఉదయ భాను ఫుల్లుగా ఎక్స్ ఫోజింగ్ చేసినా పెద్దగా లాభం లేక పోయింది. మొన్నామధ్య శేఖర్ కమ్ముల దర్వకత్వంలో రాణా హీరోగా వచ్చిన 'లీడర్' చిత్రంలో ఓ ఐటం సాంగులో నర్తించిన ఉదయ భానుకు ఆ తర్వాత ఆశించిన అవకాశాలు రాలేదనే చెప్పాలి. మరి 'జులాయి' చేతుల్లో పడ్డాక అయినా ఉదయభాను భవిష్యత్ రేఖ మారుతుందో లేదో..
అల్లు అర్జున్-ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జులాయి' చిత్రం ఆగస్టు 9న విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











