రాణా 'లీడర్' లో ఉదయభాను స్పెషల్..

By Srikanya

రామానాయుడు మనవడు రాణాను హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న లీడర్ చిత్రంలో ఉదయభాను ఓ స్పెషల్ సాంగ్ లో కనపించనుంది.టీవీ యాంకర్ గా సుపరిచితురాలైన ఆమె అంతకు ముందు కూడా కొన్ని చిత్రాల్లో చేసింది. ఆ పాట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కాగలదని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ఎవియం బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. మారుతున్న రాజకీయ పరిణామాలు నేపధ్యంలో ఈ చిత్రం కథ నడుస్తుందని చెప్తున్నారు. ఇందులో రాణా ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని,యువత రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్పులు వస్తాయనేది చర్చిస్తున్నారని తెలుస్తోంది.ఇక ఈ లీడర్ చిత్రం డిసెంబర్ 24 న రిలీజ్ చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం.ఈ చిత్రంలో రిచా, ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్రియాఆనంద్ ప్రస్తుతం దిల్ నిర్మిస్తున్న రామ్ చిత్రం రామ రామ కృష్ణ కృష్ణ లో నటిస్తోంది. ఆ చిత్రాన్ని లక్ష్యం తో హిట్టిచ్చిన వాసు డైరక్ట్ చేస్తున్నాడు.ఇక రాణా తన తదుపరి చిత్రం ప్రకాష్ అనే దర్శకుడుతో ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X