‘మధుమతి’ వివాదం: ప్రెస్ మీట్లో ఏడ్చేసిన ఉదయభాను

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను హీరోయిన్‌గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'మధుమతి'. అయితే తన పాత్రను ఈచిత్రంలో అభ్యంతరకరంగా చూపించారని ఉదయభాను ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేసారు. తాజాగా ఉదయభాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఫిల్మ్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉదయభాను మాట్లాడుతూ.....తన ఫోటోలు మార్పింగ్ చేసారనే అనుమానంతో పోలీసులను ఆశ్రయించి వారి సహాయంతో గురువారం రాత్రి సినిమా చూసానని, నా అనుమానమే నిజమైందని....తనకు చెప్పిన కథ వేరు, సినిమాలో నా పాత్రను చూపించిన విధానం వేరుగా ఉంది. అశ్లీలంగా చూపించారు అని ఆమె వాపోయారు. సినిమాలోని కొన్ని సీన్లు మార్ఫింగ్ చేసారని ఆమె ఆరోపించారు.

 Udaya Bhanu 'Madhumati' in controversy

అయితే కొన్ని ఛానల్స్, వెబ్ సైట్లు తన బాధను అర్థం చేసుకోకుండా....నేను ఓవరాక్షన్ చేస్తున్నంటూ కథనాలు వెలువరిస్తున్నారని, ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే ఎవరికీ పట్టడం లేదు అంటూ ఉదయభాను కంటతడి పెట్టారు. తన పాత్రను అశ్లీలంగా చూపించడంపై ప్రశ్నిస్తే అనవసర రాద్దాంతం అంటారా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. పబ్లిసిటీ కోసమే ఈ వివాదానికి తెరలేపారనే అంశాన్ని ఉదయభాను ఖండించారు. తనకు పబ్లిసిటీ అవసరం లేదని, వాస్తవాలు వెల్లడించడానికే తాను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మధుమతి చిత్రాన్ని గోమాతాఆర్ట్స్ పతాకంపై కడియం రమేష్ సమర్పణలో రాణీ శ్రీధర్ నిర్మించారు. ఈ చిత్రంలో దీక్షాపంథ్, విష్ణు ప్రియన్, సీతా, ప్రభాస్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కడియం రమేష్, కె. రాణి శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X