హొయలొలికించే నెరజాణ ఉదయభాను!
టివిలో హొయలొలికిస్తూ యాంకరింగ్ విభాగంలో జానవులే నెరజానవులే, ఢీ, రేలారే రేలా ప్రొగ్రామ్స్ లో తనదైన శైలిలో ముద్రవేసుకున్న ఉదయభాను కుర్రకారు గుండెలను కలవర పెడుతోంది. నిజంగా జాణవులే నెరజాణవులే అనిపించుకున్న ఉదయభాను వెండితెరపై కూడా అప్పుడప్పుడూ మెరుపులు మెరిపిస్తూ వుంటుంది.
దాసరి నారాయణరావు నిర్మించిన 'కొండవీటి సింహాసనం" చిత్రంలో ప్రత్యేక సాంగ్ లో నర్తించిన ఈ నెరజాణ ఆ తదువాత అనుకున్న విధంగా అవకాశాలను పొందలేకపోయింది. హీరోయిన్ కు కావలసిన అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ వ్యక్తిగత వివాదాల వలన అవకాశాలను చేజార్చుకుంది. బాలీవుడ్ భామలకు తీసిపోని ఒడ్డూ పొడుగూ, హొయలొలికించడంలో ఎవరికీ తక్కువ కాదు అనే విధంగా అందరితో ఇట్టే కలిసిపోయే భాను ప్రస్తుతం వెండితెర ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఉదయ భాను కొండవీటి సింహాసనం జానవులే నెర జానవులే ఢీ రేలారే రేల udaya bhanu kondaveeti simhasanam janavule nerajaanavule dee relaare rela


Click it and Unblock the Notifications