twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మధుమతి’గా ఉదయభాను...(హాట్ ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పాపులర్ యాంకర్ ఉదయభాను తొలిసారిగా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'మధుమతి'. ఉదయభాను ప్రధాన పాత్రలో గోమాతాఆర్ట్స్ పతాకంపై కడియం రమేష్ సమర్పణలో రాణీ శ్రీధర్ 'మధుమతి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ఆడియో వేడుక జరుపుకోనున్న ఈచిత్రం పోస్టర్లు తాజాగా విడుదల చేసారు.

    మధుమతి సినిమా గురించి దర్శకుడు రాజ్ శ్రీధర్ మాట్లాడుతూ...'నేను ఉదయభాను‌కు సరిపోమే కథని 8 సంవత్సరాల క్రితమే తయారు చేసుకోవడం జరిగింది. విచ్చలవిడిగా తిరిగే ఒక తెలుగు అమ్మాయిని అనుకోని పరిస్థితులో తమిళ అబ్బాయి తన ఇంటికి తీసుకెళ్ళడంతో ఎదురయ్యే పరిణామాలు‌ను తనకి అనుగుణం ఎలా మలుచుకున్నాడు అన్నది ఈ చిత్ర కథ. ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా సినిమా ఉంటుంది' అన్నారు.

    స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు...

    మధుమతి

    మధుమతి

    సమర్పకులు కడియ రమేష్ మాట్లాడుతూ...అండర్ వాటర్లో తీసిన సీన్లు చాలా బాగా వచ్చాయి. ఉదయభాను ఎంతో ధైర్యంగా ఈ సీన్లు చేసింది. కెమెరామెన్ వి.ప్రభాకర్ ఎంతో అద్భుతమైన పనితనం కనబర్చారు. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పని చేసారు. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు.

    ఉదయభాను

    ఉదయభాను

    ఈ చిత్రంలో ఉదయభాను విచ్చలవిడిగా తిరిగే అమ్మాయిగా నటిస్తోంది. మధుమతి షూటింగ్ పూర్తయింది. త్వరలో ఆడియో విడుదల చేసి సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

    ఉదయభాను ఆశలు

    ఉదయభాను ఆశలు

    ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరుగుందని, సినిమాల్లో బిజీ అవుతాననే బోలెడు ఆశలు పెట్టుకుంది ఉదయభాను.

    తారాగణం

    తారాగణం

    ఉదయభాను, దీక్ష్, శివకుమార్, గౌతమ్, సీత, తెలంగాణ శకుంతల, ప్రభాస్ శ్రీను, కమెడియన్ వేణు, సతీష్, బస్టాప్ కోటేశ్వరరావు, నాగభైరవ అరుణ్ కుమార్ తదితరులు నటించారు.

    టెక్నీషియన్స్

    టెక్నీషియన్స్

    ఈచిత్రానికి ఫోటోగ్రఫీ : సత్య వి.ప్రభాకర్, సంగీతం : రాజ్ కిరణ్, నిర్మాత: రాణి శ్రీధర్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : రాజ్ శ్రీధర్.

    English summary
    Udaya Bhanu's Madhumati movie posters released. The film already shooting completed. According to one of the unit source, Udaya Bhanu did a dare devil stunt all by herself. Madhumati is directed by Raj Srishar and is set for a August release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X