ముమైత్ మతి పోయేలా ఉదయభాను?
బాలీవుడ్ లో మల్లికా షెరావత్ ను మించి షెర్లిన్ చోప్రా బట్టలు విప్పి సంచలనం సృష్టిస్తే తెలుగులో ముమైత్ ఖాన్ ఆ పని చేస్తోంది. ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అనడానికి ఆమె చాలా కురచ దుస్తులు వేసుకుంది. ఆ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నట్టుగా ఆమె ప్రతి సినిమాలోనూ దుస్తులను మరింత కురచగా చేస్తూ శరీరాన్ని కనివిందు చేస్తోంది.
ఇపుడు ముమైత్ ఖాన్ మతిపోయేలా టీవీ యాంకర్ ఉదయభాను రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. పోసాని కృష్ణమురళి తీస్తున్న ఆపద మొక్కులవాడు సినిమాలో ఉదయభాను సెక్సీ ఐటమ్ సాంగ్ లో కనిపించినట్టు సమాచారం. ఈ పాటలో ఉదయభాను వేసుకున్న దుస్తులు చూస్తే ముమైత్ ఖాన్ మతిపోయేలా ఉన్నాయట. మొత్తానికి ముంబై టాలెంట్ కు లోకల్ టాలెంట్ చెక్ అన్నమాట. డాన్స్ ముమైత్ కు కొట్టిన పిండి...ఉదయభాను ఏ మేరకు డాన్స్ చేసిందో సినిమా బయటకు వస్తే గానీ తెలియదు. కురచ దుస్తులు వేసుకోగానే కాదు అందుకు తగిన డాన్స్ లేకపోతే వికారంగా ఉంటుంది మరి.


Click it and Unblock the Notifications











